జూనియర్ ఎన్టీఆర్, నాని ఆ తర్వాత నాగార్జున లాంటి స్టార్లు హోస్ట్ చేయడం వల్ల సరిపోయింది కానీ లేదంటే తెలుగులో బిగ్ బాస్ రియాలిటీ షో నడుస్తున్న తీరుకి ఆ ఛానల్ ఎప్పుడో గుడ్ బై చెప్పేది. ప్రతి సీజన్ లో పార్టిసిపెంట్స్ ఎంపిక, ఎలిమినేషన్లు వగైరా వ్యవహారాల పట్ల ఎన్ని విమర్శలు వస్తున్నా సరే ప్రతిసారి ఆడియన్స్ దీన్ని ఫాలో అవుతూనే ఉన్నారు. కాకపోతే టైటిల్ గెలిచిన వాళ్ళతో సహా ఎవరికీ కెరీర్ పరంగా పెద్ద బ్రేక్ దక్కకపోవడమనేది అన్ని బాషల బిగ్ బాస్ ని వెంటాడుతున్న నెగటివ్ సెంటిమెంట్.
ఇక బిగ్ బాస్ 6కి రంగం సిద్ధమవుతోంది. ఇటీవలే చేసిన ఓటిటి షో ఏ మేరకు సక్సెస్ అయ్యిందో క్లియర్ గా చెప్పడం లేదు కానీ నిర్వాహకులు మాత్రం బ్లాక్ బస్టర్ అని ప్రకటించారు. విన్నర్ గా నిలిచిన బిందు మాధవి హడావిడి సోషల్ మీడియాలో రెండు మూడు రోజులు కనిపించింది కానీ ఆ తర్వాత అంతా సైలెంట్. ఇప్పుడు ఆరో సిరీస్ కోసం ఓటిటి ఫైనలిస్టులు కొందరితో పాటు బయట నుంచి ఎంపిక చేసిన సభ్యుల జాబితా రెడీ అవుతోందని ఇన్ సైడ్ టాక్. ఆల్రెడీ నాగ్ తో షూటింగ్ కు సంబంధించిన చర్చలు జరిగాయట.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈసారి యాంకర్లు శివ, వర్షిణి, దీపికా పిల్లి, నటి నవ్య స్వామి, ధన్షు, చిత్రా రాయ్, ఆది తదితరులను ఎంపిక చేశారట. ఇంకొందరితో డిస్కషన్లు జరుగుతున్నాయి. ఈసారి విమర్శలకు చోటివ్వకుండా మరింత స్పైసీగా మార్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో కమల్ హాసన్ నడిపిస్తున్న తీరుతో పోలిస్తే తెలుగులోనే ఈ షో కొంత వీక్ గా ఉంది. నాగార్జున తప్పేం లేకపోయినా గేమ్ ని డిజైన్ చేస్తున్న విధానం మీదే కంప్లయింట్స్ ఉన్నాయి. చూడాలీసారి ఏం చేస్తారో.
This post was last modified on June 24, 2022 10:08 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…