పేరుకేమో వందల కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాయి. కానీ అవొస్తున్న ఆనందం కన్నా టెన్షనే ట్రేడ్ వర్గాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కారణం దేనికీ సరైన బజ్ లేకపోవడమే. బాహుబలి రేంజ్ లో బ్రహ్మస్త్రని ఊహించుకుంటే ట్రైలర్ వచ్చాక అందులో గ్రాఫిక్స్ మీద నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. తెలుగు వెర్షన్ కు రాజమౌళి, నాగార్జున అండదండలు ఉన్నా సరే ఇది ఎంతమేరకు అద్భుతాలు నమోదు చేస్తుందనే దాని మీద అనుమానాలు లేకపోలేదు.
ఇవాళ వచ్చిన రన్బీర్ కపూర్ మరో సినిమా షంషేరా టీజర్ లో విజువల్స్ బాగానే ఉన్నప్పటికీ కాన్సెప్ట్ కామన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందానే అనుమానం కలుగుతోంది. దీన్ని నిర్మించిన యష్ రాజ్ సంస్థకు ఇటీవలే సామ్రాట్ పృథ్విరాజ్ మిగిల్చిన పీడకల అంత సులభంగా మర్చిపోయేది కాదు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాకు హైప్, ఆశించిన హంగామా కనిపించడం లేదు. కంటెంట్ పరంగా డౌట్ లేనప్పటికీ దంగల్ స్థాయి మేజిక్ చేయకపోవచ్చని ఒరిజినల్ వెర్షన్ ఫారెస్ట్ గంప్ చూసిన విశ్లేషకుల అంచనా.
ఇక అక్షయ్ కుమార్ రక్షాబంధన్ గురించి చెప్పడానికి ఏమి లేదు. నలుగురు చెల్లెళ్ళ పెళ్లి చేయడానికి అన్నయ్య పడే కష్టాలను తెరమీద చూసేందుకు ఆడియన్స్ ఎంతమేరకు సిద్ధంగా ఉన్నారో చెప్పలేం. ట్రైలర్ చూశాక అబ్బో అనిపించే రెస్పాన్స్ అయితే రాలేదు. విక్రమ్ వేదా, పఠాన్, టైగర్ 3 లాంటి గ్రాండియర్లు వచ్చే దాకా ఈ అనిశ్చితి తప్పదని సీనియర్ పరిశీలకుల మాట. భూల్ భులయ్యా 2, ది కాశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ కటియావాడి తప్ప ఈ ఏడాది వండర్స్ చేసిన హిందీ సినిమాలేవీ లేకపోవడం ఉత్తరాది బ్యాడ్ లక్ .
This post was last modified on June 22, 2022 9:09 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…