ఎంత కాదనుకున్నా మన సినిమా మీద ఎంత నమ్మకమున్నా రిలీజ్ రోజు పోటీగా ఏమున్నాయో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఉదాహరణకు మేజర్ వచ్చిన రోజే విక్రమ్ రావడం అడవి శేష్ మూవీని కేరళ, తమిళనాడులో తీవ్రంగా ప్రభావితం చేసింది. లేదంటే ఇంకో అయిదారు కోట్లు ఎక్స్ ట్రా సులభంగా వచ్చి ఉండేది. అంతదాకా ఎందుకు తెలుగు రాష్ట్రాల్లోనూ మాస్ సెంటర్స్ లో ఈ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. ఒకవేళ మేజర్ సోలోగా వచ్చి ఉంటే రీచ్ ఇంకా పెరిగి ఉండేదని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు.
ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం జూలై 29కి రామారావు ఆన్ డ్యూటీ ఫిక్స్ కావడమే. అదే రోజు శేష్ హిట్ కేస్ 2 వస్తోంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. రవితేజ టీమ్ మాత్రం సాయంత్రం హఠాత్తుగా అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మొన్నటిదాకా ఉన్న అనుమానాలకు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు. మాస్ మహారాజా ఫ్యాన్స్ హమ్మయ్య అనుకున్నారు కానీ ఇప్పుడు హిట్ 2 వెనుకడుగు వేస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. విక్రమ్ వస్తుందని తెలిసీ మేజర్ రిస్క్ తీసుకున్నప్పుడు ఇప్పుడు రామారావు కోసం భయపడనక్కర్లేదుగా.
కాకపోతే హిట్ 2 క్రైమ్ డ్రామా. అన్ని వర్గాల ప్రేక్షకులను రీచ్ అవుతుందని చెప్పలేం. ఎవరు తరహాలో లిమిటెడ్ అప్పీల్ ఉంటుంది. నిర్మాత నాని కాబట్టి బడ్జెట్ బాగానే పెట్టి ఉంటారు కానీ అవతల మాస్ ని టార్గెట్ చేసిన రామారావుకు టాక్ బాగా వస్తే హిట్ 2కు ఇబ్బందవుతుంది. విశ్వక్ సేన్ ప్లేస్ ని తీసుకుని అడవి శేష్ సెకండ్ పార్ట్ ని ఎలా చేసుంటాడన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఇంకా రెండు నెలల టైం ఉంది కాబట్టి ఈలోగా ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతాయోఇప్పుడే చెప్పలేం. లెట్ వెయిట్ అండ్ సీ
This post was last modified on June 22, 2022 9:02 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…