లోకేష్ కనకరాజ్.. ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ షాట్ డైరెక్టర్లలో ఒకడు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ తర్వాత ఈ మధ్య కాలంలో అంతగా చర్చనీయాంశం అయిన దర్శకుడు అతనే. సౌత్ ఇండియాలో టాప్ హీరోలు ఒక సినిమా చేయాలని ఆశపడుతున్న డైరెక్టర్లలో అతనొకడనడంలో సందేహం లేదు. ‘విక్రమ్’ తర్వాత అతడి డిమాండ్ మమూలుగా లేదు. ప్రస్తుతానికి అతను విజయ్‌తో కొత్త సినిమాకు కమిటై ఉన్నాడు. ఆ తర్వాత అవకాశాన్ని బట్టి విక్రమ్-2, ఖైదీ-2 సినిమాలు చేయాలనుకుంటున్నాడు. కానీ ఈ లోపు లోకేష్ నుంచి కమిట్మెంట్ తీసుకోవాలని కొందరు స్టార్లు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల లోకేష్‌తో అల్లు అర్జున్ సినిమా అంటూ ఒక ప్రచారం నడిచింది. కానీ అది నిజం కాదని తేలింది. తెలుగులో ఏ హీరోతో లోకేష్ ఓ సినిమా చేశాడంటే అది మొదట రామ్ చరణ్‌తోనే అయ్యుంటుందన్నది ఇండస్ట్రీ వర్గాల సమాచారం. చరణ్‌తో లోకేష్‌కు అంత రాపో ఉందని, వీరి మధ్య కథాచర్చలు కూడా జరిగాయని వార్తలు రావడం తెలిసిందే.
తాజాగా ఓ తమిళ ఇంటర్వ్యూలో లోకేష్ మాటల్ని బట్టి చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. చరణ్‌తో మీ రిలేషన్ ఏంటి.. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లినపుడు ఏం జరిగింది అని ఈ ఇంటర్వ్యూలో అడగ్గా.. ‘‘రామ్ చరణ్ సార్‌తో నా పరిచయం ఇప్పటిది కాదు. చాన్నాళ్ల నుంచి మేమిద్దరం టచ్‌లో ఉన్నాం. తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటాం. గతంలో రెండుసార్లు చరణ్ సార్‌ను కలిసి కథలు కూడా నరేట్ చేశాను. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆయనకు ఫోన్ చేసేంత సాన్నిహిత్యం ఉంది.
ఇటీవల ‘విక్రమ్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం హైదరాబాద్‌కు వెళ్లినపుడు.. చిరంజీవి గారి ఇంటి నుంచి డిన్నర్ కోసం ఆహ్వానం వచ్చింది. చిరంజీవి గారితో కలిసి షూటింగ్ చేస్తున్న సల్మాన్ ఖాన్ గారు కూడా ఆ విందుకు వస్తారని చెప్పారు. నాకు చాలా టెన్షన్‌గా అనిపించింది. చరణ్ నాకు క్లోజ్ కాబట్టి అతనుంటే కొంచెం సౌకర్యంగా ఉంటుందని చూస్తే.. ఆయన ఊర్లో లేడు. కమల్ సార్‌తో కలిసి ఆ డిన్నర్‌కు వెళ్లినపుడు ఎవరెవరు ఏం సినిమాలు చేస్తున్నాం అనేదే మాట్లాడుకున్నాం. అంతకుమించి ఏమీ లేదు’’ అని లోకేష్ తెలిపాడు. లోకేష్ మాటల్ని బట్టి చూస్తే చరణ్‌కు అతను బాగానే క్లోజ్ అని అర్తమవుతోంది. కాబట్టి భవిష్యత్తులో వీళ్లిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశాలు లేకపోలేదు.
This post was last modified on June 22, 2022 11:50 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…