Movie News

జగన్ చేసింది ఎలా కరెక్ట్?

టికెట్ల రేట్ల విష‌యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క‌రెక్ట్.. రేట్లు పెంచాల‌ని అడిగిన మేమంతా జోక‌ర్లం. మేం చేసింది చాలా పెద్ద త‌ప్పు.. ఇదీ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఇచ్చిన స్టేట్మెంట్. ఈ వీడియో ప‌ట్టుకుని వైఎస్ జ‌గ‌న్ మ‌ద్ద‌తుదారులు సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. వ‌ర్మ స్టేట్మెంట్‌ను ఒక స‌ర్టిఫికెట్ లాగా చూపించి.. ఎలివేష‌న్లు ఇస్తున్నారు. కానీ వ‌ర్మ ఈ ఇష్యూలో చాలా తెలివిగా జ‌గ‌న్‌ను హైలైట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని జ‌నాల‌కు అర్థం కావ‌ట్లేదు.

అస‌లు ఏపీలో టికెట్ల రేట్ల విష‌యంలో త‌లెత్తిన స‌మ‌స్య ఏంట‌న్న‌ది ఇక్క‌డ చూడాలి ముందు. వ‌కీల్ సాబ్ రిలీజ్ టైంలో జ‌గ‌న్‌ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఇబ్బంది పెట్ట‌డం కోస‌మే ఏపీ ప్ర‌భుత్వం ఉన్న‌ట్లుండి రేట్లు త‌గ్గించింది. ఆ త‌గ్గించ‌డం కూడా అలా ఇలా కాదు.

ఏపీలో చిన్న సెంటర్ల పేరు చెప్పి మరీ 5, 10, 15, 20 రూపాయలకు టికెట్ల రేట్లు పెట్టడం పెద్ద సమస్య అయింది. అన్ని ర‌కాల ధ‌ర‌లూ విప‌రీతంగా పెరిగిపోయి, థియేట‌ర్ల మెయింటైనెన్స్ చాలా క‌ష్టం అయిపోయిన ఈ రోజుల్లో ఏ సెంట‌ర్ అయినా స‌రే.. ఇలాంటి రేట్ల‌తో మ‌నుగ‌డ అసాధ్యం. ఈ నేప‌థ్యంలో ఏపీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కోరుకున్నది.. ఎ, బి, సి అని ఏరియాలు చూడకుండా రూ.100 కామన్ రేట్లు ఉండేలా చూడాలని. ఆ మాత్రం రేటు ఉంటే ఎవరికీ ఇబ్బంది లేదు. ప్రేక్ష‌కుల‌కు కూడా స‌మ్మ‌త‌మే.

కానీ ఇటు తెలంగాణలో, అటు ఏపీలో అంతకుమించి చాలా ఎక్కువగా రేట్లు పెంచేయడంతో వచ్చింది సమస్య. పెద్ద సినిమాలకు రెండు చోట్లా అదనంగా రేట్లు వడ్డిస్తున్నారు. అది ఇంకా పెద్ద ఇబ్బందిగా మారింది. అంతే తప్ప మరీ ఏపీ సర్కారు మరీ అన్యాయంగా 10-20 రూపాయలకు టికెట్లు అమ్మాలనడమే విడ్డూరం. అది జనాలకు కూడా సహేతుకంగా అనిపించలేదు. ఈ విషయాన్ని కవర్ చేస్తూ వర్మ జగన్‌ కరెక్ట్ అంటూ ఎలివేషన్ ఇవ్వడం, దానికి జ‌గ‌న్ మ‌ద్ద‌తుదారులు మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం ఆశ్చర్యం.

This post was last modified on June 20, 2022 9:43 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

15 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

44 minutes ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago