కారణాలు ఏవైనా ముందు అనుకున్న విడుదల తేదీ మిస్ అయితే కొత్తది సెట్ చేసుకోవడం నిర్మాతలకు పెద్ద సవాల్ గా మారుతోంది. కరోనా తర్వాత నుంచి ఈ ఇబ్బంది మరీ తీవ్రమయ్యింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో అయిదారు సినిమాలతో పోటీ పడక తప్పడం లేదు. అలా అని అందరూ ఇలా ధైర్యం చేయడం లేదు. చూద్దాం మంచి టైం వస్తే వేసుకుందామని ఆగిపోయి నెలల తరబడి ల్యాబ్ లో ఉంటూ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి. అందులో యూత్ హీరో నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి ఒకటి.
ఎప్పుడో రెండు నెలల క్రితం టీజర్ వచ్చింది. ఏప్రిల్ లో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. కట్ చేస్తే కెజిఎఫ్ ప్రభంజనంతో పాటు తీవ్రమైన కాంపిటేషన్ వెనుకడుగు వేసేలా చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు అలా వచ్చి ఇలా వెళ్లాయి. కొన్ని బాగా ఆడాయి. కొన్ని పోరాడుతున్నాయి. కానీ కృష్ణ వ్రింద విహారికి మాత్రం మోక్షం దక్కడం లేదు. టైటిల్ హోమ్లీగా ఉన్నా మంచి రొమాంటిక్ టచ్ తో రూపొందిన ఈ లవ్ ఎంటర్ టైనర్ కు అనీష్ ఆర్ కృష్ణ దర్శకుడు. ఆడియన్స్ కి దీని మీద పెద్ద ఫోకస్ ఏమి లేదు.
కానీ సిచువేషన్ చూస్తుంటే రాబోయే రెండు నెలల్లో రావడం కష్టమే అనిపిస్తోంది. ప్రతి వారం క్రేజీ మూవీస్ తో శుక్రవారాలు ప్యాక్ అయ్యాయి. జూలైలో పక్కా కమర్షియల్, థాంక్ యు, ది వారియర్, హ్యాపీ బర్త్ డే, కార్తికేయ 2, విక్రాంత్ రోనా, హిట్ 2 సెకండ్ కేస్ వరసగా వస్తున్నాయి. ఆగస్ట్ లోనేమో బింబిసార, సీతారామమ్, కోబ్రా, యశోద, మాచర్ల నియోజకవర్గం, లాఠీ, స్వాతిముత్యం, లైగర్ ఇలా చాంతాడంత లిస్టు ఉంది. ఆగస్ట్ మూడో వారం మాత్రమే ప్రస్తుతానికి ఖాళీగా ఉంది. అసలే వరస ఫ్లాపులతో నాగ శౌర్య మార్కెట్ డౌన్ లో ఉన్న టైంలో ఇలాంటి వాయిదాలు ఆలస్యాలు ఎక్కువ ఉండటం సేఫ్ కాదు. మరి కృష్ణుడి నిర్ణయం ఎలా ఉండబోతోందో.
This post was last modified on June 18, 2022 10:10 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…