శుక్రవారం రామ్ చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్ మూవీలో అతడి పాత్రను పరిచయం చేస్తూ ఒక చిన్న టీజర్ ఒకటి వదిలాడు దర్శకుడు రాజమౌళి. ఇందులో చరణ్ లుక్, అతడి స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజిలో ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకపోయాయి.
చరణ్ కెరీర్లో ఈ పాత్ర మరో మైలురాయిలా నిలవడం ఖాయంగా కనిపించింది. ఐతే సినిమా నుంచి ముందు ఎన్టీఆర్‌ది కాకుండా చరణ్ పాత్ర తాలూకు టీజర్ రిలీజ్ చేస్తుండటం పట్ల ముందు నందమూరి అభిమానుల్లో ఒకింత నిరాశ వ్యక్తమైంది. కానీ టీజర్ చూశాక మాత్రం వాళ్ల నిరాశ అంతా ఎగిరిపోయింది. ఈ టీజర్లో చరణ్ ఎలా హైలైట్ అయ్యాడో ఎన్టీఆర్ సైతం అదే స్థాయిలో హైలైట్ కావడం విశేషం.
చరణ్ బర్త్ డే టీజర్లో తారక్ కనిపించకుండానే తనదైన ముద్ర వేశాడు. ఆ పాత్రను పరిచయం చేసింది తారకే. ఇందుకోసం అదిరిపోయే డైలాగులు రాయడం.. ఆ డైలాగుల్ని తారక్ తనదైన వాచకంతో అద్భుత రీతిలో చెప్పడం.. నా అన్న మన్నెం దొర అల్లూరి సీతారామరాజు అంటూ గూస్ బంప్స్ ఇచ్చేలా పాత్రను పరిచయం చేయడంతో చరణ్ పాత్ర తాలూకు ఎలివేషన్ ఓ రేంజికి వెళ్లిపోయింది.
మెగా, నందమూరి అభిమానులు ఎవ్వరూ నిరాశ చెందకుండా.. అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకునేలా ఈ టీజర్‌ను రాజమౌళి బ్యాలెన్స్ చేసిన తీరు అమోఘం. ఇదే బ్యాలెన్స్ సినిమాలోనూ జక్కన్న పాటిస్తాడన్న నమ్మకాన్ని టీజర్ కలిగించింది. సినిమాలో హీరోలిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ బ్రిటిష్ వారిపై పోరాడేలా కథ ఉంటుందని కూడా ఈ టీజర్‌ను బట్టి స్పష్టమైంది.
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…