ఎన్నో ఎదురుచూపులు వాయిదాల తర్వాత ఎట్టకేలకు విరాటపర్వం విడుదలైపోయింది. దగ్గుబాటి అభిమానుల నిరీక్షణ ఫలించింది. ఫలితం గురించి అప్పుడే ఒక కంక్లూజన్ కు రావడం తొందపాటు అవుతుంది కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు పలు ఇంటర్వ్యూలలో రానా అన్న మాటలు సినిమా చూశాక నిజమనిపిస్తున్న మాట వాస్తవం. ఈ సినిమాకు సాయిపల్లవే హీరో అని రవన్న పాత్ర ఎవరైనా చేయొచ్చు కానీ వెన్నెల క్యారెక్టర్ లో మాత్రం ఇంకెవరిని ఊహించుకోలేమని చెప్పి అంచనాలు అమాంతం పెంచేశాడు.
ఇలా పదే పదే హీరోయిన్ గురించి ఇంతగా హై లైట్ చేయడం పట్ల రానా ఫ్యాన్స్ కొంత ఫీలైనప్పటికీ అతని నిజాయితీ అందరికి కనెక్ట్ అయ్యింది. విరాటపర్వంలో నిజంగానే సాయిపల్లవి వన్ విమెన్ షో చేసేసింది. ఇంత బరువైన ఎమోషన్లున్న పాత్రని ఇంకెవరు చేయగలరని ఆలోచిస్తే సమాధానం దొరకదు. ప్రేమకోసం తపించే అమ్మాయిగా, ప్రియుడి కోసం గన్ను పట్టుకుని ప్రాణాలకు సైతం తెగించే కామ్రేడ్ గా, క్లైమాక్స్ లో కంటతడి పెట్టించే ఎక్స్ ప్రెషన్లతో మొత్తానికి రానా చెప్పినట్టు చెలరేగిపోయింది.
కాకపోతే ఫిదాలాగా సాయిపల్లవి దీన్ని బాక్సాఫీస్ వద్ద ఎంతమేరకు నెగ్గుకు వస్తుందనేది చూడాలి. ఎందుకంటే విరాట పర్వం ఫ్యామిలీ ఆడియన్స్ ని థియేటర్ కు రప్పించడం కష్టమే. యూత్ అండ్ మాస్ మీదే ఆధారపడాలి. పైగా మౌత్ టాక్ చాలా కీలకంగా మారనుంది. మెల్లగా లేడీ పవర్ స్టార్ బిరుదుని సాయిపల్లవికి తగిలిస్తున్న తరుణంలో రాబోయే రోజుల్లో పెర్ఫార్మన్స్ లు ఒకటే కాదు బాక్సాఫీస్ సక్సెస్ లు కూడా కీలకంగా ఉంటాయి. రెగ్యులర్ పాత్రలకు దూరమనే సాయిపల్లవి ఇంకెలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేస్తుందో .
This post was last modified on June 17, 2022 7:09 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…