‘బాహుబలి’ తర్వాత రాజమౌళి రూపొందించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రపంచవ్యాప్తంగా మూడు నెలల కిందట విడుదల కావడం.. అంచనాలకు తగ్గట్లే భారీ విజయాన్నందుకోవడం తెలిసిందే. ఆ సినిమా థియేట్రికల్ రన్ ఆల్రెడీ ముగిసింది. కానీ నెట్ ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.
‘బాహుబలి’తో పోలిస్తే తక్కువ అనిపించిన మన వాళ్లకు తక్కువగా అనిపించిన ‘ఆర్ఆర్ఆర్’కు అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన స్పందన వస్తోంది.ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు, నేటివ్ అమెరికన్స్ ఈ సినిమా చూసి వెర్రెత్తిపోతున్నారు. నెట్ ఫ్లిక్స్ల్ ఈ సినిమా చూసి కోట్లాది మంది ఎగ్జైట్ అయిపోతున్నారు. అందులోనూ ఇటీవల యుఎస్‌లో encoRRReపేరుతో మళ్లీ ఈ సినిమాను రిలీజ్ చేయగా.. రెస్పాన్స్ మామూలుగా లేదు.
ఫేమస్ హలీవుడ్ సూపర్ హీరోల సినిమాలు చూస్తున్నపుడు ఉండే యుఫోరియా థియేటర్లలో కనిపిస్తోంది.ఈ క్రమంలోనే ‘ఆర్ఆర్ఆర్’ యుఎస్‌లో అరుదైన ఘనత సాధించింది. అక్కడ ప్రధాన మీడియా సంస్థల్లో ఒకటైన ‘యుఎస్ఏ టుడే’.. ‘ఆర్ఆర్ఆర్’కు గొప్ప గౌరవాన్నే కట్టబెట్టింది. 2022 టాప్-10 సినిమాల జాబితాను ప్రకటించిన యుఎస్ఏ టుడే.. ‘ఆర్ఆర్ఆర్’కు అగ్రస్థానాన్ని కట్టబెట్టడం విశేషం. బ్యాట్ మ్యాన్, టాప్ గన్ మావ్రిక్, ఫాలౌట్ లాంటి భారీ హాలీవుడ్ చిత్రాలను మన సినిమా వెనక్కి నెట్టేసింది.
ముందు హాలీవుడ్ వైపు నుంచి ‘ఆర్ఆర్ఆర్’ మీద ప్రశంసలు కురుస్తుంటే.. ఇదేదో పెయిడ్ ప్రాపగండా అనుకున్నారు. కానీ అక్కడి వారికి ‘ఆర్ఆర్ఆర్’ నిజంగానే తెగ నచ్చేసిందని.. పెద్ద ఎత్తున ప్రముఖులు ఎగ్జైట్మెంట్‌తో స్పందిస్తుంటే అర్థమైంది. ‘పుష్ప’ సినిమా హిందీ జనాలకు అనుకోకుండా విపరీతంగా నచ్చేసినట్లే ‘ఆర్ఆర్ఆర్’ సైతం యుఎస్ నేటివ్ అమెరికన్స్‌ను మెప్పించి వారిని వెర్రెత్తిపోయేలా చేసిందన్నది స్పష్టం. ప్రేక్షకులకు నచ్చడం ఒకెత్తయితే ప్రముఖ మీడియా సంస్థ.. దీనికి టాప్ ర్యాంక్ ఇవ్వడం మరో ఎత్తు.
This post was last modified on June 17, 2022 10:54 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…