తమిళ స్టార్ హీరో విజయ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు టైటిల్ లాక్ చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. తమిళ వెర్షన్ కు వారరిసు, తెలుగులోవారసుడుగా డిసైడ్ చేశారట. యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ లీకవుతున్న సోర్స్ నుంచి సోషల్ మీడియా అప్పుడే వైరల్ అయిపోయింది.
ఇదేంటి ఇంత సాఫ్ట్ టైటిల్ పెడతారా అని విజయ్ అభిమానులు ట్విట్టర్ లో తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. విజయ్ తో మనకంత కనెక్షన్ లేదు కాబట్టి నో ప్రాబ్లమ్. ఈ టైటిల్ కు అక్కినేని నాగార్జునకు కనెక్షన్ ఉంది. 1993లో ఇదే పేరుతో నాగ్ కు సూపర్ హిట్ మూవీ ఉంది. కామెడీ చిత్రాలతో అప్పుడప్పుడే దర్శకులుగా ఎదుగుతున్న ఈవివి సత్యనారాయణగారిని స్టార్ డైరెక్టర్ గా మార్చేసింది ఈ సినిమానే.
హిందీ ఫూల్ ఔర్ కాంటే రీమేక్ గా తీసిన ఈ చిత్రంలో గాడ్ ఫాదర్ ధర్మతేజగా సూపర్ స్టార్ కృష్ణ గారి పెరఫార్మన్స్ ని అంత ఈజీగా మర్చిపోలేం. శ్రీకాంత్ ఇందులో నెగటివ్ షేడ్స్ తో ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారు. టీవీలో వచ్చిన ప్రతిసారి మంచి ఎంటర్ టైనర్ గా ఫీలవుతారు ఆడియన్స్.
మరి అంత ట్రాక్ రికార్డు ఉన్న వారసుడు కంటే బెస్ట్ టైటిల్ విజయ్ కి ఇంకేముంటుంది. గత ఏడాది చిరంజీవి మాస్టర్ ని వాడేసుకున్నాడు. ఇప్పుడు దీని వంతు వచ్చింది. రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ కాగా శరత్ కుమార్, సత్యరాజ్, ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ, యోగిబాబు లాంటి పెద్ద క్యాస్టింగే ఉంది. ఈ వారసుడులోనూ మన శ్రీకాంత్ నటించడం మరో ట్విస్ట్. 2023 సంక్రాంతికి విడుదలకు ప్లాన్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు ఇంకా ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే చేస్తారు.
This post was last modified on June 16, 2022 7:11 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…