లోకనాయకుడు కమల్ హాసన్ కొత్త సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తోందని చెప్పాలి. గత రెండు దశాబ్దాల్లో కమల్ ట్రాక్ రికార్డు బాగా దెబ్బ తినేయడంతో ‘విక్రమ్’ ఆయనకు ఓ మోస్తరు స్థాయి విజయాన్నందిస్తే చాలనుకున్నారంతా. కానీ ఆ చిత్రం రికార్డుల మోత మోగిస్తూ బ్లాక్‌బస్టర్ స్టేటస్ అందుకుంది. తమిళంలో ఆల్ టైం రికార్డు దిశగా దూసుకెళ్తోంది.
తన సొంత బేనర్లో తెరకెక్కిన ఈ చిత్రంతో కమల్ భారీ లాభాలే అందుకున్నాడు. ఆయన అప్పులన్నీ కూడా ఒక్క దెబ్బకు ఎగిరిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఆనందంలో ఆయన దర్శకుడు లోకేష్ కనకరాజ్‌కు లగ్జరీ కారును, సినిమాలో అతిథి పాత్ర చేసిన సూర్యకు రోలెక్స్ వాచీని గిఫ్టుగా ఇచ్చారు. ఐతే సినిమా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగీత దర్శకుడు అనిరుధ్‌కు అయితే కమల్ ఏ బహుమతీ ఇవ్వలేదు.
తాజాగా ‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్‌తో కలిసి అనిరుధ్ కేరళలో సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్లో అక్కడి విలేకరి.. అనిరుధ్‌కు ఆసక్తికర ప్రశ్న వేశాడు. లోకేష్‌కు కారు, సూర్యకు వాచీ ఇచ్చిన కమల్.. మీకేమీ బహుమతిగా ఇవ్వలేదా అని అడిగాడు. దానికి అనిరుధ్ ఇచ్చిన సమాధానంతో ఆ విలేకరికి దిమ్మదిరిగిపోయే ఉంటుంది. ‘‘నాకు విక్రమ్ సినిమాను ఇచ్చారు. ఇంకేం కావాలి’’ అన్నాడు అనిరుధ్.
అంతే.. ఆ మాటకు మీటింగ్ హాల్ హోరెత్తిపోయింది. 17 ఏళ్ల వయసులో ‘3’ సినిమాతో కెరీర్‌ను ఆరంభించి, కొలవెరి పాటతో అరంగేట్రంలోనే సంచలనం రేపిన అనిరుధ్.. ఇప్పటికే కోలీవుడ్లో టాప్ స్టార్లందరితోనూ సినిమాలు చేశాడు. అతను చివరగా జట్టు కట్టిన పెద్ద హీరో కమలే. ఆయన సినిమాకు పని చేయాలన్నది అతడి కల. ‘ఇండియన్-2’తోనే అది సాధ్యమైంది కానీ.. ఆ సినిమా మధ్యలో ఆగిపోవడం అతడికి నిరాశ కలిగించింది. ఇప్పుడు ‘విక్రమ్’తో వచ్చిన అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకున్నాడు. మైండ్ బ్లోయింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్, పాటలతో సినిమాను ఇంకో స్థాయిలో నిలబెట్టాడు.
This post was last modified on June 16, 2022 5:23 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…