అక్కినేని అభిమానులు బాగా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్న సినిమా ఏజెంట్. కెరీర్ మొదలుపెట్టి ఆరేళ్ళు దాటినా అఖిల్ కు ఒక్క బ్లాక్ బస్టర్ పడలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అయ్యింది కానీ మరీ గొప్పగా చెప్పుకునే స్థాయిలో కాదు. మొదటి మూడింటి ఫలితాల గురించి అందరికీ తెలిసిందే. కేవలం ప్రేమకథలతో మార్కెట్ లో స్థిరపడలేమని గుర్తించి ఏరికోరి మరీ అఖిల్ ఈ ఏజెంట్ ని ఎంచుకున్నాడు.
సిక్స్ ప్యాక్ తో పాటు బాడీ మీద స్పెషల్ ఫోకస్ పెట్టి కండలు తిరిగిన శరీరంతో పూర్తిగా మారిపోయాడు. దర్శకుడు సురేందర్ రెడ్డి సైరా తర్వాత గ్యాప్ ఎక్కువగానే తీసుకున్నాడు. మెగాస్టార్ మూవీ యావరేజ్ కావడంతో ఈసారి ప్యాన్ ఇండియా అడుగు గట్టిగా పడాలని అతని టార్గెట్.
ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు విడుదలెప్పుడు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. గతంలో ఆగస్ట్ 12ని అఫీషియల్ గా ప్రకటించారు. కానీ ఇప్పుడా తేదీకి రావడం లేదు. ఇంకా వర్క్ పెండింగ్ ఉంది. అందుకే స్వాతిముత్యం, మాచర్ల నియోజకవర్గం, కోబ్రా, యశోద లాంటివన్నీ ఇండిపెండ్స్ డేని టార్గెట్ గా పెట్టుకుని వచ్చేస్తున్నాయి.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఏజెంట్ దసరా బరిలో దిగబోతున్నాడు. సెప్టెంబర్ చివరి వారం ఒక ఆప్షన్ ఉంది. కానీ అదే టైంలో మణిరత్నం మల్టీ స్టారర్ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 ఉంది. దాని బదులు అక్టోబర్ ఫస్ట్ వీక్ బెటరనే అభిప్రాయం టీమ్ లో వ్యక్తమవుతోందట. అదే సీజన్ మీద చిరంజీవి గాడ్ ఫాదర్, బాలకృష్ణ గోపీచంద్ మలినేని సినిమాలు కన్నేశాయి. అధికారికంగా ముందు ప్రకటించేవారు సేఫ్ అవుతారు. అందుకే వీలైనంత త్వరగా ఏజెంట్ డేట్ ని లాక్ చేసి టీజర్ తో అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని వినికిడి.
This post was last modified on June 16, 2022 1:24 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…