మాములుగా సాంకేతిక నిపుణుల కెరీర్ స్పాన్ స్టార్ హీరోలకు ఉన్నంత రాదు. దర్శకులైనా మ్యూజిక్ డైరెక్టర్లైనా మహా అయితే ఓ ఇరవై ఏళ్ళు పీక్స్ చూశాక ఫ్లాపులు వచ్చేసి ఆటోమేటిక్ గా కెరీర్ స్లో అయిపోతుంది. 90ల టైంలో టాప్ లో ఉన్న ఏఆర్ రెహమాన్ ఇప్పుడు ఆ స్థాయి మేజిక్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే ఫ్యాన్స్ ని సంపాదించుకున్న మణిశర్మ ఆచార్యలో ఆ విషయం మీదే విమర్శలు ఎదురుకున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ లాంటి యంగ్ టాలెంట్స్ కూడా స్ట్రగుల్ అవుతున్న ఉదంతాలు చూస్తున్నాం. అనూహ్యంగా కీరవాణి మాత్రం దీనికి రివర్స్ లో వెళ్తున్నారు. ఒకానొక టైంలో ఈయనా డౌన్ ఫాల్ చూసినవాళ్ళే. కాకపోతే ఎప్పటికప్పుడు రాజమౌళి సినిమాలు బూస్ట్ లా పని చేసి ఆఫర్లు వచ్చేలా చేస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ ప్రభావం వల్ల మళ్ళీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. కుంజు మోన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న జెంటిల్ మెన్ 2కి రెహమాన్ బదులు కీరవాణికే ఓటేశారు. చంద్రముఖి ఫస్ట్ పార్ట్ కి మ్యూజిక్ ఇచ్చింది విద్యాసాగర్ అయితే లారెన్స్ తో చేస్తున్న సీక్వెల్ ని మన మరగతమణికే పిలిచి మరీ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో వస్తున్న హరిహర వీరమల్లు ఆల్రెడీ పాటల కంపోజింగ్ అయిపోయింది. నేపధ్య సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉన్న నేపథ్యంలో దీని మీద అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఎలాగూ మహేష్ బాబు జక్కన్న కాంబోని టేకప్ చేసేది కీరవాణే. ఇవే కాదు కళ్యాణ్ రామ్ బింబిసార ఆల్రెడీ పూర్తి చేశారు. జయమ్మ పంచాయితీ లాంటి చిన్న సినిమాలకూ చేయూతనిస్తున్నారు. తమన్ లాంటి నవతరం ఎంత పోటీ ఇస్తున్నా ముప్పై ఏళ్ళ అనుభవాన్ని దాటేసిన కీరవాణి ఇంకా అవకాశాలు అందిపుచ్చుకోడం రికార్డే
This post was last modified on June 16, 2022 1:19 pm
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…