Movie News

ఎంత మంచి పని చేశావ్ రాజమౌళీ..

రాజమౌళి బాలీవుడ్‌ను కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఈ రోజు ఉత్తరాది ప్రేక్షకులు సౌత్ సినిమాలను నెత్తిన పెట్టుకుని హిందీ సినిమాలను తిరస్కరిస్తున్నారంటే ఆ దిశగా పునాది వేసింది జక్కన్న సినిమా బాహుబలినే. ఆ సినిమాతో నెవర్ బిఫోర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన రాజమౌళి.. హిందీ ప్రేక్షకులను వశం చేసుకున్నాడు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’తోనూ మరోసారి వారిని మెస్మరైజ్ చేశాడు. రాజమౌళి తన సినిమాలతో ఇచ్చే విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇండియాలో ఇంకెవ్వరూ ఇవ్వలేరన్నది స్పష్టం.

అప్పటికే మగధీర, ఈగ సినిమాలతో విజువల్ ఎఫెక్ట్స్‌ మీద పట్టు సాధించి, మన ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిన జక్కన్న.. ‘బాహుబలి’తో చాలా మెట్లు ఎక్కేశాడు. వీఎఫెక్స్ అంటే ఎలా ఉండాలి అనే విషయంలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఆ ప్రమాణాలను అందుకోవడం మిగతా వాళ్లకు చాలా కష్టం అయిపోతోంది.

ఒకప్పుడు ఎఫెక్ట్స్ పేరుతో ఏం చూపించినా నోరెళ్లబెట్టి చూసేవారు ప్రేక్షకులు. కానీ ‘బాహుబలి’ తర్వాత ఏదీ వారి అంచనాలను అందుకోవడం లేదు. అది మిగతా చిత్రాలకు శాపంగా మారుతోంది. ఇప్పుడు హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ ట్రైలర్ చూసి అందరూ పెదవి విరుస్తుండటానికి పరోక్షంగా ‘బాహుబలి’నే కారణం. అందులో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ చూసి.. ఇవి చూసేసరికి సాధారణంగా అనిపిస్తున్నాయి. వీఎఫెక్స్ మీద గతంలో ఏ కామెంట్లు చేయని వాళ్లంతా కూడా ఇప్పుడు బిలో పార్ అనే మాటను వాడుతున్నారు.

జక్కన్నలా విజువల్ ఎఫెక్స్ట్‌ను సరిగ్గా ఉపయోగించుకోవడం, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వడం వేరే వాళ్లకు సాధ్యం కావట్లేదన్నది స్పష్టం. ఆ విజన్ అందరికీ ఉండదు. ప్రపంచస్థాయి వీఎఫెక్స్ నిపుణులతో హైర్ చేసుకోవచ్చేమో కానీ.. వారికి చెప్పి పని చేయించుకోవడం, ఔట్ పుట్ తీసుకోవడం అన్నది తేలికైన విషయం కాదు. అందులో మాస్టర్ అయిన జక్కన్న మిగతా డైరెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారాడు.

This post was last modified on June 15, 2022 5:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మ‌ళ్లీ పాత‌కాల‌పు బాబు.. స‌ర్ ప్రైజ్ విజిట్స్‌కు రెడీ!

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌ళ్లీ పాత‌కాల‌పు పాల‌న‌ను ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయ‌నున్నారా? ప్ర‌భుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల ప‌నుల ను ఆయ‌న…

3 hours ago

షోలే, డిడిఎల్ కాదు….ఇకపై పుష్ప 2 సింహాసనం!

సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…

4 hours ago

అభిమాని గుండెల‌పై చంద్ర‌బాబు సంత‌కం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 45 ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నారు. ఇప్ప‌టికి మూడు సార్లు ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…

4 hours ago

సినిమా నచ్చకపోతే డబ్బులు వాపస్…అయ్యే పనేనా?

థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…

5 hours ago

పుష్ప 2 : అప్పటి దాకా OTT లోకి వచ్చేదే లే!!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…

6 hours ago