ప్రస్తుతం చాలా మంది కుర్ర హీరోలు హిట్ లేక సతమతమవుతున్నారు. అందులో సత్యదేవ్ కూడా ఉన్నాడు. ఈ కుర్ర హీరోకి ఇంత వరకూ ఓ సూపర్ హిట్ పడలేదు. జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోగా పరిచయమైన సత్య దేవ్ అప్పటి నుండి సోలో హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ సరైన హిట్ దక్కలేదు. బ్లఫ్ మాస్టర్ రిలీజ్ తర్వాత పేరు తీసుకొచ్చింది తప్ప థియేటర్స్ లో ఆడలేదు. ఇక ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య కూడా ఓటీటీ లో ఫరవాలేదనిపించుకుంది.
ఇక ‘తిమ్మరుసు’ కి పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులను థియేటర్స్ కి రాప్పించలేకపోయింది. ఆ రకంగా సత్య దేవ్ క్రౌడ్ పుల్లర్ అనిపించుకోలేకపోయాడు. సత్య దేవ్ చేసిన ఈ మూడు సినిమాలు రీమేకే. ఇప్పుడు స్ట్రైట్ కథతో ‘గాడ్సే’ సినిమా చేశాడు. ఈ సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ కి ఇంకా రెండ్రోజులే ఉంది అయినా ఎలాంటి బజ్ లేదు. ట్రైలర్ హిట్టయింది కానీ అది వాట్సాప్ లో స్టేటస్ పెట్టుకోవడానికి మాత్రమే వచ్చిన వీడియోగా జనాలు చూస్తున్నారు తప్ప సినిమా చూడాలనే ఆసక్తి కనబరచడం లేదు. ప్రస్తుతం ఈ సినిమా బుకింగ్స్ చూస్తే అది అర్థమవుతుంది.
ఏదేమైనా సత్య దేవ్ కి ఈ సినిమాతో హిట్ కొట్టడం చాలా ముఖ్యం. కంటెంట్ తో ప్రేక్షకులను రాప్పించగలిగితే ఓ మోస్తారు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ ‘ గుర్తుందా శీతాకాలం’ అనే మరో రీమేక్ సినిమాతో రాబోతున్నాడు. అలాగే ఫుల్ బాటిల్ అనే సినిమా సెట్స్ పై ఉంది. రెండు మూడు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టుకున్నాడు. చిరంజీవి తో గాడ్ ఫాదర్ లో విలన్ గా నటిస్తున్నాడు. ఇలా సత్య బిజీగానే ఉన్నాడు కానీ సక్సెస్ లేకుండా కెరీర్ ని కొనసాగిస్తున్నాడు. అది తోడైతే ఈ కుర్ర హీరో ఇంకా బిజీ అయిపోవడం ఖాయం.
This post was last modified on June 15, 2022 5:07 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…
ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…
డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…