తమ సినిమాల మీద నిర్మాతలకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా తప్పు లేదు కానీ పోటీ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అసలే బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. బడ్జెట్ మూవీస్ వస్తున్నాయంటే జనాలు లైట్ తీసుకుంటున్నారు. ఓటిటిలో చూద్దాంలే అనే ధోరణి, ఆర్ఆర్ఆర్ కెజిఎఫ్ లాంటివి అనుభూతి చెందాక థియేటర్ కంటెంట్ విషయంలో మారిపోయిన అభిప్రాయాలు ఇవన్నీ చిన్న చిత్రాలకు ఇబ్బందికరంగా మారాయి. అయినా ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు.
వచ్చే వారం 24న ఏకంగా ఎనిమిది సినిమాలో బరిలో ఉండటం ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇన్నేసి ఆప్షన్లు ఉంటే అరకొరగా వచ్చే ఓపెనింగ్స్ ని పంచుకోవాల్సి వస్తుందని దీనివల్ల నష్టపోయే వాళ్లే ఎక్కువగా ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకసారి లిస్టు వైపు లుక్ వేస్తే కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ మీద యూత్ కి ఓ మాదిరి అంచనాలున్నాయి. ఉన్నట్టుండి డేట్ ప్రకటించిన ఆకాష్ పూరి ‘చోర్ బజార్’ మాస్ సర్కిల్స్ ని నమ్ముకుని వస్తోంది. ఎంఎస్ రాజు గారి ‘7 డేస్ 6 నైట్స్’ని అదే రోజు బరిలో దింపుతున్నారు.
చాలా కాలంగా తెరమీద కనిపించడం మానేసిన సాయిరాం శంకర్ హీరోగా రూపొందిన ‘పధకం ప్రకారం’ ముందు నుంచి ప్లాన్ చేసుకోకుండా హఠాత్తుగా డేట్ వేసుకుంది. ఇవి కాకుండా గ్యాంగ్ స్టర్ గంగరాజు, టెన్త్ క్లాస్ డైరీస్, షికారు, సదా నన్ను నడిపే సైతం రేస్ లో ఉన్నాయి. వీటికన్నా ఒకరోజు ముందు రామ్ గోపాల్ వర్మ ‘కొండా’తో దిగుతున్నాడు. ఫైనల్ గా రెండే రోజుల్లో తొమ్మిది సినిమాలు టికెట్ కౌంటర్ల మీద దాడి చేయబోతున్నాయి. దేనికీ క్రేజీ ఓపెనింగ్ రాదు కానీ మొదటి రోజు వచ్చే టాక్ వీటికి చాలా కీలకం కానుంది. ఒక శుక్రవారాన్ని పెద్ద సినిమాలు పూర్తిగా వదిలేయడం వల్ల ఏర్పడిన పరిస్థితి ఇది. చూడాలి మరి వీటిలో ఎవరు నెగ్గుతారో.
This post was last modified on June 15, 2022 12:28 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…