ఇంకా షూటింగ్ మొదలుకాలేదు కానీ బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి అభిమానుల్లో చర్చ జోరుగా ఉంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో చేస్తున్నది కూడా మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఫరే చేంజ్ కోసం కామెడీ జానర్ ని ఎంచుకున్నారేమోననే డౌట్ వాళ్ళలో కలుగుతోంది. అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ టైమింగ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. స్పాంటేనియస్ గా అలా నవ్వించడం ఎవరూ ఊహించనిది. ఎంత స్క్రిప్టెడ్ అయినప్పటికీ అది పండించే నేర్పు ఉండాలిగా.
కాకపోతే బాలయ్యతో కామెడీ ఎంత వరకు సేఫ్ అనేది విశ్లేషించుకోవాలంటే కొంత వెనక్కు వెళ్ళాలి. సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్ తర్వాత కొంత మార్పుగా ఉంటుందని ఈవివి సత్యనారాయణతో గొప్పింటి అల్లుడు చేశారు బాలయ్య. ఫలితం సోసోనే. భలేవాడివి బాసూ ఘోరంగా దెబ్బ తింది. అంతకు ముందు 80 దశకంలో అనసూయమ్మ గారి అల్లుడు, భానుమతి గారి మొగుడు, నారి నారి నడుమ మురారి, రాముడు భీముడు ఇవన్నీ ఎంటర్టైనర్లే. సూపర్ హిట్లే. కాకపోతే ఆయన స్థాయిలో రికార్డులు సృష్టించినవి కాదు.
అందుకే అనిల్ రావిపూడి ఎలాంటి సబ్జెక్టు రాసుకున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. పైగా బ్రో ఐ డోంట్ కేర్ అనే టైటిల్ ప్రచారంలోకి రావడం పైన చెప్పింది నిజమనేలానే ఉంది. శత్రువులను నరికే ఉగ్రరూపంలో బాలయ్యని చూడటం అలవాటైన మాస్ కి అనిల్ రావిపూడి స్టైల్ ఎలా సింక్ అవుతుందో వేచి చూడాలి. సరిలేరు నీకెవ్వరులో మహేష్ బాబుని బ్యాలన్స్ చేశాడు కానీ ఆ పోలిక ఇక్కడ కరెక్ట్ కాదు. ఎఫ్3 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అనిల్ బాలయ్య 108ని సెప్టెంబర్ తర్వాత మొదలుపెట్టే అవకాశాలున్నాయి.
This post was last modified on June 14, 2022 11:53 am
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…