Movie News

డిజాస్టర్ నష్టాలకు డిజిటల్ మందు

ఈ మధ్యకాలంలో పెద్ద హీరో సినిమా డిజాస్టర్ అయితే దాని నష్టం ఊహకందని స్థాయిలో ఉంటోంది, ఓ ఇరవై ఏళ్ళ క్రితం టెక్నాలజీ ఈ స్థాయిలో లేనప్పుడు చిరంజీవి బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల చిత్రాలు ఫ్లాప్ అయినా సరే అభిమానంతోనో టైం పాస్ కు వేరే ఆప్షన్ లేదనే కారణంతోనో వాటిని థియేటర్లలో చూసేవాళ్ళు. దీని వల్ల చెప్పుకోదగ్గ వసూళ్లు వచ్చి నిర్మాతకు ఆర్థిక భారం తగ్గేది. వీడియో క్యాసెట్లు డివిడిల జమానాలోనూ వీటి తాకిడిని తట్టుకుని నిలబడ్డారు ప్రొడ్యూసర్లు. ఇప్పుడా పరిస్థితులు మచ్చుకు కూడా లేవు.

ఉదయం షోకి అస్సలు బాలేదనే టాక్ వస్తే చాలు సాయంత్రం ఆటకి జనం ఉండటం లేదు. బుకింగ్ కౌంటర్లు వెలవెలబోతున్నాయి. కట్ చేస్తే ఎగ్జిబిటర్లకు అద్దెలు సైతం వసూలు కాని దయనీయ పరిస్థితి నెలకొంటోంది. ఇదంతా డిజిటల్ ట్రెండ్ మహాత్యమే. ఆ మధ్య ఆచార్యకు జరిగిన పరాభవం గుర్తుందిగా. రాధే శ్యామ్ ఎంతగా ఇబ్బంది పడిందో ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఖిలాడి పరిస్థితి మరీ ఘోరం. సర్కారు వారి పాటకు ముందు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ మూడో వారం నుంచే విపరీతమైన స్ట్రగుల్ చవిచూడాల్సి వచ్చింది.

తాజాగా బాలీవుడ్ లో మూడు వందల కోట్ల బడ్జెటని చెప్పుకుని వచ్చిన సామ్రాట్ పృథ్విరాజ్ పట్టుమని వంద కోట్లు తేలేక గుడ్లు తేలేసింది. దెబ్బకు అమెజాన్ ప్రైమ్ తో యష్ రాజ్ సంస్థ ముందు చేసుకున్న ఒప్పందాన్ని సవరించుకుని కేవలం నాలుగు వారాల్లోనే ఓటిటి రిలీజ్ చేసేలా ఒప్పుకుని దానికిగాను అదనపు ఆదాయం అందుకుంది. పైన చెప్పిన కొన్ని తెలుగు సినిమాలకూ ప్రైమ్ ఇదే తరహా స్పెషల్ ఆఫర్ ఇచ్చి సదరు నిర్మాతలకు ఊరట కలిగించింది. ఒకవేళ కరోనా రాకపోయి ఓటిటి విప్లవం ఈ స్థాయిలో లేకపోతే ఖచ్చితంగా ఈ తరహా పరిస్థితులు ఉండేవి కాదేమో. అప్పుడు శాటిలైట్ మీద ఆధారపడాల్సి వచ్చేది. అంతా కాల మహత్యం.

This post was last modified on June 13, 2022 3:11 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

6 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

7 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

7 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

7 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

8 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago