‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన వెంకటేష్ మహా ఆ సినిమాతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఆ తర్వాత సత్య దేవ్ హీరోగా ‘ఉమామహేశ్వర ఉగ్ర రూపశ్య’ అనే రీమేక్ సినిమా చేశాడు. ఆ సినిమా ఓటీటీలో విడుదలై ఓ మోస్తారుగా మెప్పించింది. ఆ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న వెంకటేష్ తాజాగా నాని తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట. ఇటివలే నేచురల్ స్టార్ కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేసి నెరేషన్ ఇచ్చాడట. కేరాఫ్ కంచరపాలెం లాంటి రియలిస్టిక్ కథతోనే నాని ని అప్రోచ్ అయ్యాడని తెలుస్తుంది.
ఇక నానికి స్టోరీ నచ్చడంతో సినిమా ఫైనల్ చేశాడని టాక్. ప్రస్తుతం నాని శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడితో ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా డెబ్బై శాతం షూట్ ఉంది. ప్రస్తుతం అంటే సుందరానికీ ప్రమోషన్స్ కోసం బ్రేక్ ఇచ్చిన నాని త్వరలోనే దసరా మరో షెడ్యుల్ స్టార్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమా తర్వాత #Nani30 గా వెంకటేష్ మహాతో సినిమా చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతానికయితే నాని నెక్స్ట్ సినిమా గురించి ఎక్కడా అప్ డేట్ ఇవ్వలేదు. దసరా రిలీజ్ తర్వాతే నెక్స్ట్ స్టెప్ వేయాలని చూస్తున్నాడు. మరి దసరాతో ఓ ప్రయోగం చేస్తున్న నాని వెంటనే వెంకటేష్ రియలిస్టిక్ స్క్రిప్ట్ తో మరో ప్రయోగం చేస్తాడా చూడాలి.
This post was last modified on June 11, 2022 9:45 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…