ఓటీటీల ద్వారా అదనపు ఆదాయం వస్తోందని మురిసిపోతూ వచ్చారు నిర్మాతలు. కానీ ఈ ఆదాయం పైకి కనిపిస్తుంది కాబట్టి సంతోషమే. కానీ ఓటీటీలో చేస్తున్న బయటికి కనిపించని నష్టాన్నే నిర్మాతలు అంచనా వేయలేకపోతున్నారు. దీని వల్ల శాటిలైట్ హక్కుల రేట్లు తగ్గాయి. అలాగే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య క్రమ క్రమంగా తగ్గిపోతోంది.
కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చినా రెండు వారాలకే ఓటీటీల్లో ప్రత్యక్షం అవుతుండటం.. పెద్ద సినిమాలను కూడా మూడు వారాలకే డిజిటల్ రిలీజ్ చేస్తుండటంతో ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతోంది. కొన్ని రోజులు ఆగితే ఓటీటీలో వస్తుంది కదా అన్న ఆలోచనతో థియేటర్లకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టి సినిమా చూడటానికి ప్రేక్షకులు వెనుకంజ వేస్తున్నారు. ఆచార్య, సర్కారు వారి పాట లాంటి పెద్ద సినిమాలు మూడు వారాలకే ఓటీటీల్లో రిలీజైపోవడం తెలిసిందే.
ఐతే దీని తాలూకు ప్రతికూల ప్రభావం గురించి టాలీవుడ్లో పెద్ద చర్చే నడుస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాతలు ఈ విషయంలో చర్చించుకుని ఇండస్ట్రీలో అంతర్గతంగా కొన్ని కండిషన్లు పెట్టాలని డిసైడైనట్లు అల్లు అరవింద్ కుటుంబ సన్నిహితుడు, నిర్మాత బన్నీ వాసు సంకేతాలు ఇచ్చాడు.
గీతా ఆర్ట్స్ సినిమాల వరకు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఐదు వారాల్లోపు డిజిటల్ రిలీజ్ ఉండకూడదని నియమం పెట్టుకున్నామని.. బాలీవుడ్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా తగ్గిపోతుండటంతో థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీ విడుదలకు 8 వారాల గ్యాప్ ఉండాలని కండిషన్ పెట్టుకున్నారని.. టాలీవుడ్లో కూడా ఇలాంటి కండిషన్లు రాబోతున్నాయని అతను తెలిపాడు.
మరీ మూడు వారాలకే సినిమాలు ఓటీటీల్లో వచ్చేస్తుండటంతో థియేటర్లకు ఏం వెళ్తాంలే అనుకుంటున్నారని.. కాబట్టి ఓటీటీ విండో విషయంలో కఠినంగా ఉండాల్సిందే అని.. నిర్మాతల్లో దీనిపై చర్చలు జరుగుతున్నాయని.. త్వరలోనే నియమ నిబంధనలతో ఒక ప్రకటన వస్తుందని వాసు స్పష్టం చేశాడు.
This post was last modified on June 14, 2022 11:48 am
మహేష్ బాబు సినిమాను రాజమౌళి ఈపాటికే మొదలుపెట్టాల్సింది. కానీ పర్ఫెక్ట్ బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసిన తరువాతనే ప్రాజెక్టును స్టార్ట్…
ఐపీఎల్ మొదలైన తరువాత క్రికెట్ ప్రపంచంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. నేటితరం యువకులు అతి చిన్న వయసులోనే క్రికెట్…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఐడియా వేస్తే.. తిరుగుండదు. అది ఎన్నికలైనా.. రాజకీయాలైనా పాలనలో అయినా.. ఆయన ఆలోచనలు…
పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గొప్ప సక్సెసయ్యాక ఇప్పుడు అందరి చూపు గేమ్ ఛేంజర్ మీదకు వెళ్తోంది.…
‘పుష్ప-2’ ట్రైలర్ లాంచ్ నార్త్ ఇండియాలో చేస్తున్నారంటే ఢిల్లీ, ముంబయి లాంటి సిటీల్లో ప్రెస్‌ను పిలిచి సింపుల్‌గా చేసేస్తారని అనుకున్నారంతా.…