ఏ టెక్నీషియన్ కి అయినా కొందరు నటుల మీద అమితమైన ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టంతో వారి సినిమాలకు బెస్ట్ అవుట్ పుట్ ఇస్తుంటారు. తాజాగా మ్యూజిక్ సెన్సేషన్ తమన్ కూడా అదే చేస్తున్నాడు. తమన్ బాలయ్య మీద ప్రేమతో మ్యూజిక్ ఇస్తూ ఆ సినిమాలను ఎలివేట్ చేస్తున్న విధానం చూస్తే ఆ విషయం యిట్టె అర్థమైపోతుంది. నిజానికి ఈ మధ్య కాలంలో తమన్ బెస్ట్ వర్క్ అంటే ‘అఖండ’ నే. ఆ సినిమాకు స్పీకర్లు పగిలిపోయేలా నెక్స్ట్ లెవెల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు తమన్. బాలయ్య మీద ప్రేమతో జై బాలయ్య అనే సాంగ్ కూడా కంపోజ్ చేసి నందమూరి ఫ్యాన్స్ కి ఓ ఆంథెం అందించాడు.
అఖండ కోసం భారీ ఎక్యుప్ మెంట్ వాడాడు కూడా. రాత్రిపగలు తేడా లేకుండా ఆ సినిమాకు వర్క్ చేశాడు. బాలయ్య నటన చూస్తే గూస్ బంప్స్ వస్తుందని అందుకే హై వోల్టేజ్ స్కోర్ ఇచ్చానని ఆ సందర్భంలో చెప్పుకున్నాడు తమన్. దీంతో ఆ సినిమాకు సంబంధించి దర్శకుడు , హీరోకి సమానంగా తమన్ కి పేరొచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమతో బాలయ్య సినిమాకు బెస్ట్ వర్క్ ఇస్తున్నాడు తమన్. గోపీచంద్ -బాలయ్య కాంబోలో వస్తున్న NBK107 టీజర్ తాజాగా రిలీజయింది. ఆ టీజర్ కి అదిరిపోయే స్కోర్ ఇచ్చి బాలయ్య కేరెక్టర్ ని ఎలివేట్ చేసాడు తమన్.
సినిమాకు కూడా అదే రేంజ్ స్కోర్ ఇవ్వబోతున్నాడు. అయితే ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. దర్శకుడు గోపీచంద్ మలినేనితో తమన్ కి మంచి స్నేహం ఉంది. ఇద్దరూ బావ అని పిలుచుకుంటారు. అందుకే గోపీచంద్ మలినేని ప్రీవియస్ మూవీ ‘క్రాక్’ కి మంచి స్కోర్ తో పాటు బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. అటు బాలయ్య మీద ఇష్టం ఇటు గోపీచంద్ సినిమా కావడంతో తమన్ NBK107 కి బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో మళ్ళీ తన నేపథ్య సంగీతం గురించి గట్టిగా చెప్పుకోవాలని డిసైడ్ అయిపోయాడు.
This post was last modified on June 10, 2022 7:44 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…