హీరోయిన్ల ‘బరువు’ భారాలు!

ఇండస్ట్రీ లాక్ డౌన్ చేసి పెట్టడంతో పాటు జిమ్ లు కూడా మూసేసి పెట్టడంతో పర్సనల్ జిమ్ లేని హీరోయిన్లకు ఫిగర్ కాపాడుకోవడం సమస్యగా మారింది. పర్సనల్ ట్రైనర్లు, జిమ్ లు అందుబాటులో లేని వేళ… ఇంటి ఫుడ్ వల్ల డైటింగ్ చేయడం కష్టంగా మారిన తరుణంలో… బరువు పెరగకుండా చూసుకోవడం అన్నిటికంటే పెద్ద పరీక్ష అయింది.

కొంత మంది హీరోయిన్లు యోగా లాంటివి చేస్తూ జాగ్రత్త పడుతున్నా కానీ చాలా మంది వెయిట్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా టీవీ సెలెబ్రిటీలకు ఈ ఇబ్బంది బాగా ఎక్కువ అయిందట.

సినిమా షూటింగ్స్ మళ్ళీ మొదలయ్యే టైమ్ కంటే ముందే జిమ్స్ తెరిచేస్తే బాగుండని వారంతా కోరుకుంటున్నారు. లాక్ డౌన్ సమయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో కష్టం కాగా హీరోయిన్లలో కొందరిది ఈ కష్టం అన్నమాట. సీత కష్ఠాలు సీతవి… పీత కష్ఠాలు పీతవి అంటే ఇదేనేమో కదూ?