Movie News

బాలయ్య పంచ్‌లు.. జగన్ ఊరుకుంటాడా?

తన సినిమాల్లో రాజకీయ, సినీ ప్రత్యర్థుల మీద పంచులు వేయడం నందమూరి బాలకృష్ణకు కొత్తేమీ కాదు. ‘అధినాయకుడు’ సినిమాలో విగ్రహాల రాజకీయం అంటూ అప్పుడు వైఎస్ ఫ్యామిలీ మీద పరోక్షంగా సెటైర్లు వేయడం తెలిసిందే. అలాగే ‘సింహా’ సినిమాలో చరిత్ర సృష్టించాలన్నా మేమే అంటూ పరోక్షంగా మెగా ఫ్యామిలీ మీద కౌంటర్లు వేశాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇలా మరి కొన్ని సినిమాల్లోనూ పంచులు, కౌంటర్లు చూడొచ్చు.

ఇప్పుడు తన కొత్త సినిమాలోనూ బాలయ్య ఇదే బాటలో నడుస్తున్నట్లున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలయ్య చేస్తున్న కొత్త సినిమా టీజర్ నిన్న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ రోజు బాలయ్య బర్త్ డేను పురస్కరించుకుని ఈ టీజర్ లాంచ్ చేశారు. ఇందులో బాలయ్య వేసిన రెండు పంచులు చర్చనీయాంశం అయ్యాయి.

‘‘మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్. నా జీవో గాడ్స్ ఆర్డర్’’ అనే డైలాగ్ జగన్ సర్కారును ఉద్దేశించిందే అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో మంచి ఊపు కనిపిస్తుండటం.. జగన్ సర్కారు మీద గట్టిగా ఎదురు దాడి చేస్తుండటం తెలిసిందే. ఈ క్రమంలోనే బాలయ్య.. వైకాపా ప్రభుత్వం ఇచ్చే జీవోలకు విలువ లేదని పరోక్షంగా కౌంటర్ వేశాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక

బాలయ్య నుంచి వచ్చిన మరో పవర్ ఫుల్ డైలాగ్‌ చివర్లో ‘బోసిడీకే’ అనే పదం పెట్టారు. కొన్ని నెలల కిందట ఈ పదం ఏపీలో ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. టీడీపీ నేత పట్టాభిరామ్ ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి ఈ మాట అనగా.. దీనికి రకరకాల భాష్యాలు చెప్పారు జనాలు. స్వయంగా జగనే ఇదో పెద్ద బూతు పదం అన్నట్లు పబ్లిక్ మీటింగ్‌లో చెప్పి సింపతీ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. అంత డిస్కషన్ తర్వాత బాలయ్య నోట ఈ పదం రావడం చర్చనీయాంశమైంది. ఇలా పరోక్షంగా తన మీద, తన ప్రభుత్వం మీద బాలయ్య పంచులు వేసిన నేపథ్యంలో ఈ సినిమా రిలీజైనపుడు ఇబ్బంది పెట్టకుండా వదులుతారా అన్నది డౌట్.

This post was last modified on June 10, 2022 1:48 pm

Share

Recent Posts

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

11 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

13 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

4 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

5 hours ago