Movie News

ఇండస్ట్రీ ఏ ఒక్కరిది కాదు: పవన్

నాని ‘అంటే సుందరానికీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కి పవన్ చీఫ్ గెస్ట్ గా రావడంతో సినిమాపై హైప్ పెరిగింది. ఇక ఈ మధ్య సినిమా ఫంక్షన్ లకు దూరంగా ఉంటూ రాజకీయ పరంగా ప్రజలకు దగ్గరగా ఉంటున్న పవర్ స్టార్ స్పీచ్ ఈవెంట్ కి హైలైట్ గా నిలిచింది. ముందుగా పవన్  నాని గురించి మాట్లాడాడు. నాని నటుడిగా ఇష్టమని అతని వ్యక్తిత్వం అంటే మరింత ఇష్టమని చెప్పాడు.

ఒక రోజు మా చెల్లి హడావుడిగా బయటికి వెళ్తుంది. ఎక్కడికి అని అడిగితే నాని సినిమా చూడ్డాటానికి అంటూ చెప్పింది. సో మా కుటుంబంలో కూడా నానికి ఫ్యాన్స్ ఉన్నారని నానిని ప్రైస్ చేసాడు పవన్. అలాగే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ పరిశ్రమ ఎవరి సొత్తు కాదని , ఇది అందరికి చెందుతుందని అన్నారు.

కేరళ నుండి నజ్రియా ఇంకో ప్రాంతం నుండి మరొకరు ఇలా టాలెంట్ ఉంటె ఎవరైనా తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాలు చేసుకోవచ్చని పవన్ అన్నారు. ఇక ఈవెంట్ లో నాని గారు ముందుండాలని నేను వెనుక ఉండాలని అందుకే తన గురించి ఏవి వేయవద్దని చెప్పానని కానీ ఈవెంట్ లో నా ఏవి వేయడం నాకు కోపం తెప్పించిందని కాకపోతే అభిమానుల కోసం వీళ్ళు వేయకతప్పలేదని భావిస్తున్నాని అన్నాడు.  
ఇక ఫినిషింగ్ టచ్ గా ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా గురించి కూడా పవన్ మాట్లాడాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి నిర్మాతలతో ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాను అంటూ చెప్పాడు పవన్. దీంతో ఈ సినిమాపై ఉన్న రూమర్లు కి కూడా చెక్ పెట్టాడు పవర్ స్టార్.

This post was last modified on June 10, 2022 6:55 am

Share

Recent Posts

పెళ్లి గురించి హనుమాన్ హీరో క్లారిటీ

టాలీవుడ్లో యువ కథానాయకులు ఒక్కొక్కరుగా పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో అల్లు శిరీష్ వివాహం చేసుకున్న…

6 hours ago

లెక్క తప్పిన చుక్క చిత్రాలు… ఇమేజ్ మీద మరకలు

భారీ ప్యాన్ ఇండియా మూవీ, ఇమేజ్ ఉన్న స్టార్ హీరో అని కథ పూర్తిగా వినకుండా, జల్లెడ పట్టకుండా తొందరపడితే…

6 hours ago

సెక్యూరిటీ లేకుండా వెళ్లి చంద్రబాబుతో పవన్ ఏం చెప్పారు?

సుప్రీం కోర్టు తీర్పుతో మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు.…

7 hours ago

అర్జునుడి కష్టాలు పేరుకి తగ్గట్టే ఉన్నాయి

తమ స్వంత ప్రమేయం లేకుండా ఎవరి వల్లనో ఇబ్బందులు, కష్టాలు పడాల్సి వస్తే ఆ బాధ మాములుగా ఉండదు. ఇట్లు…

8 hours ago

ప్రశాంత్ నీల్ బ్రాండ్ మహత్యం ఇది

కెజిఎఫ్, సలార్ రూపంలో తనకంటూ కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. తను డైరెక్ట్ చేయకపోయినా కేవలం కథను…

8 hours ago

సంజూ మొదలెట్టాడు… నమన్ ధీర్ ముగించాడు!

225 పరుగులు చేసినా న్యూజిలాండ్‌కు విజయం దక్కలేదు. టీమ్ఇండియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేదించింది. అయితే…

9 hours ago