ఈ వారం తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో అంటే సుందరం ఒకటే డామినేషన్ కానీ వచ్చే శుక్రవారం మాత్రం మరో ఆసక్తికరమైన పోటీ నెలకొంది. విరాట పర్వం, గాడ్సే లు జూన్ 17న థియేటర్లలో అడుగు పెట్టనున్నాయి. రానా-సాయిపల్లవి, దర్శకుడు వేణు ఊడుగుల గత రెండు మూడు రోజులుగా కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రమోషన్లు చేస్తున్నారు.
ట్రైలర్ కు ఆశించిన దానికన్నా గొప్ప రెస్పాన్స్ అందింది. ప్రత్యేకంగా టాలీవుడ్ సెలబ్రిటీలకు వేసిన స్పెషల్ ప్రీమియర్ల నుంచి చాలా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇక గాడ్సే ప్రమోషన్ సైతం స్పీడ్ మీదే ఉంది. దర్శకుడు గోపిగణేష్ పట్టాభి, సత్యదేవ్ పలు ప్రాంతాలు తిరుగుతూ పబ్లిసిటీ చేసే పనిలో ఉన్నారు. ఇందాక ట్రైలర్ వచ్చేసింది.
అంతా బాగానే ఉంది కానీ ఈ రెండు సినిమాలకు ఒక సమస్య ఉంది. ఇవి సోషల్ ఇష్యూస్ మీద చాలా సీరియస్ గా డిస్కస్ చేసే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్. ఎంటర్ టైన్మెంట్ పెద్దగా ఉండదు. ఆలోచింపజేసే ఆవేశపూరిత సంబాషణలు ఉంటాయి. నేపధ్యాలు వేరైనప్పటికీ సమాజాన్నిసూటిగా బుల్లెట్ లా ప్రశ్నించే కాన్సెప్ట్ తో రూపొందాయి.
అసలే జనాలు యాక్షన్ మూవీస్ కి బాగా అలవాటు పడ్డారు. కథలు బలంగా లేకపోయినా ఎలివేషన్లు అద్భుతంగా కుదిరిన కెజిఎఫ్ 2, విక్రమ్ లు అన్నేసి కోట్లు రాబట్టడానికి కారణం ఇదే. ఆర్ఆర్ఆర్ లోనూ ఫైట్లదే పైచేయి. పుష్పను కాపాడింది కమర్షియల్ అంశాలే. ఎఫ్3 అవుట్ అండ్ అవుట్ కామెడీ కాబట్టి అదీ పాస్ అయ్యింది. సర్కారు వారి పాట మహేష్ ఇమేజ్ తో గట్టెక్కింది. కానీ ఇవేవి లేని విరాటపర్వం, గాడ్సేలు తమ ప్రయత్నంలోని నిజాయితీతోనే మెప్పించాల్సి ఉంటుంది. మరి ఆడియన్స్ అండగా నిలుస్తారా?
This post was last modified on June 9, 2022 6:08 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…