కొన్నేళ్లుగా వరుస అపజయాలతో సతమవుతున్న కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమాతో ఐయాం బ్యాక్ అనిపించుకున్నాడు. తొలి రోజు మార్నింగ్ షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా భారీ వసూళ్ళు రాబడుతుంది. ఇప్పటికే నూట యాబై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసిన ఈ సినిమా అతి త్వరలోనే 200 కోట్ల (గ్రాస్) మార్క్ చేరుకోనుంది.
ఈ సందర్భంగా సినిమాకు పనిచేసిన అందరికీ నిర్మాత కమల్ నుండి బహుమతులు అందాయి. ముందుగా దర్శకుడు లోకేష్ కి లెక్సస్ బ్రాండ్ న్యూ కారును గిఫ్ట్ గా ఇచ్చారు కమల్. అలాగే సినిమాకు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ పదమూడు మందికి బైకులు అందించారు. ఇక క్లైమాక్స్ లో రోలెక్స్ అంటూ గూస్ బంప్స్ తెప్పించి
సీక్వెల్ కి ఎలివేషన్ ఇచ్చిన సూర్య కి తన కాస్ట్లీ రోలెక్స్ వాచ్ ను గిఫ్టుగా ఇచ్చారు. అలాగే మిగతా టీంకి కూడా కమల్ నుండి బహుమతులు అందాయట. విక్రమ్ తో నిర్మాతగా కమల్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. సినిమా ఊహించని విధంగా వసూళ్ళు రాబడుతుండటంతో సంతోషంలో మునకలేస్తున్నారు.
ఇక రిలీజ్ కి ముందు హైదరాబాద్ వచ్చి తెలుగు ప్రేక్షకులతో మాట్లాడిన కమల్ సినిమా హిట్టయితే మళ్ళీ వచ్చి థాంక్స్ చెప్పుకుంటానని అన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా సినిమా సూపర్ సక్సెస్ అనిపించుకోవడంతో త్వరలోనే కమల్ ఇక్కడికి వచ్చి సక్సెస్ మీట్ పెట్టి రిలీజ్ చేసిన సుధాకర్ రెడ్డి కి అలాగే ప్రేక్షకులను కలుసుకోనున్నారు.
This post was last modified on June 8, 2022 5:50 pm
వైసీపీలో ఇప్పటి వరకు ఓ మోస్తరు నేతలను మాత్రమే టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు పెద్ద తలకాయల జోలికి…
ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని…
ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల…
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొత్త తరహా రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటిదాకా రాజకీయ నాయకులంటే……
కోర్ట్ రూపంలో ఇటీవలే బ్లాక్ బస్టర్ చవి చూసిన ప్రియదర్శి నెల తిరగడం ఆలస్యం ఏప్రిల్ 18న సారంగపాణి జాతకంతో…