Movie News

మేజ‌ర్.. ఇక్క‌డ బ్లాక్‌బ‌స్ట‌ర్.. అక్క‌డ ఫ్లాప్

క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు సినిమాల‌తో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ క‌థానాయ‌కుడు అడివి శేష్‌. త‌న‌లోని ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు కూడా ఈ సినిమాలు పెద్ద విజ‌యం సాధించ‌డంలో కీల‌క‌మ‌య్యాయి. మేజ‌ర్ సినిమాకు కూడా ఇదే ఒర‌వ‌డిని కొన‌సాగించాడు శేష్‌. ఆ చిత్రానికి ర‌చ‌నా స‌హ‌కారం అందిస్తూ.. సందీప్ ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌ను అద్భుతంగా పోషించి సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ రావ‌డంలో శేష్ కీల‌క పాత్ర పోషించాడు.

మేజ‌ర్ తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు అంచ‌నాల‌ను మించి పెర్ఫామ్ చేస్తోంది. గ‌త వారం వ‌చ్చిన ఎఫ్‌-3ని ప‌క్క‌న పెట్టి ఫ్యామిలీ ఆడియ‌న్స్ సైతం ఈ సినిమా వైపు క‌దులుతున్నారు. క‌మ‌ల్ సినిమా విక్ర‌మ్ తెలుగులో ఈ చిత్రానికి గ‌ట్టి పోటీనే ఇస్తున్న‌ప్ప‌టికీ.. ఓవ‌రాల్‌గా శేష్ సినిమానే పైచేయి సాధిస్తోంది. ఇప్ప‌టికే మేజ‌ర్ ఓవ‌రాల్‌గా రూ.40 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. అందులో నాలుగింట మూడొంతుల‌కు పైగా వ‌సూళ్లు తెలుగు రాష్ట్రాల నుంచే వ‌చ్చాయి.

ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో బ‌య్య‌ర్లంద‌రూ సేఫ్ జోన్లోకి వ‌చ్చేశారు. ఇక రాబోయేదంతా వారికి లాభ‌మే. కాబ‌ట్టి ఈ చిత్రం తెలుగులో బ్లాక్‌బ‌స్ట‌ర్ అని తీర్మానించేయొచ్చు. ఐతే మేజ‌ర్ రిలీజైన మిగ‌తా భాష‌లు హిందీ, మ‌ల‌యాళంలో మాత్రం ఈ సినిమా అనుకున్నంత మేర స‌త్తా చాట‌లేక‌పోయింది. శేష్ హిందీ, మ‌ల‌యాళ ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేక‌పోవ‌డం, అత‌ను స్టార్ కాక‌పోవ‌డం, ఇక్క‌డి నుంచి వ‌చ్చే మాస్ సినిమాల టైపు మేజ‌ర్ కాక‌పోవ‌డం ప్ర‌తికూలం అయి ఉండొచ్చు.

పైగా హిందీలో భూల్ భూల‌యియా-2 ఇంకా బాగా ఆడుతుండ‌గా.. కొత్త‌గా పృథ్వీరాజ్, విక్ర‌మ్ మూవీస్ నుంచి పోటీ త‌ప్ప‌లేదు. మ‌ల‌యాళంలో పూర్తిగా విక్ర‌మ్ ఆధిప‌త్యం న‌డుస్తోంది. దీంతో మేజ‌ర్ మీద ఈ భాష‌ల ప్రేక్ష‌కులు ఫోక‌స్ పెట్ట‌లేదు. హిందీలో మేజ‌ర్ రూ.5 కోట్ల మార్కును అందుకోవ‌డం కూడా క‌ష్టంగానే ఉంది. సినిమాకు లాంగ్ ర‌న్ ఉంటుంద‌ని నిర్మాత‌లు అంటున్న‌ప్ప‌టికీ అలాంటి సంకేతాలు క‌నిపించ‌డం లేదు. అక్క‌డ ఈ సినిమా ఫ్లాప్ అయ్యేట్లే ఉంది.

This post was last modified on June 8, 2022 12:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

2 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

5 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

8 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

10 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

10 hours ago