నేచురల్ స్టార్ నాని సినిమా వస్తోందంటే.. బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో హడావుడి ఉంటుంది. ప్రోమోల హంగామా కనిపిస్తుంది. జనాలు పెద్ద ఎత్తున డిస్కషన్లు పెడతారు. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ మంచి ఊపు కనిపిస్తుంది. కానీ కరోనా తర్వాత మారిన పరిస్థితుల్లో ఇప్పుడా హడావుడి కనిపించడం లేదు.
అతడి కొత్త సినిమా అంటే సుందరానికీ రిలీజ్ ముంగిట అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. కరోనా టైంలో వి, టక్ జగదీష్ సినిమాల డిజిటల్ రిలీజ్‌తో తన బ్రాండ్ వాల్యూను దెబ్బ తీసుకున్నాడు నాని. శ్యామ్ సింగరాయ్‌తో కొంత లోటు పూడ్చుకున్నా, మళ్లీ ప్రేక్షకుల నమ్మకం పొందగలిగినా.. అంటే సుందరానికీ మూవీకి అది పెద్దగా కలిసొస్తున్నట్లు లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే సుందరానికీ బుకింగ్స్ మొదలయ్యాయి. కానీ టికెట్ల కోసం జనాలు అంతగా ఎగబడుతున్నట్లు కనిపించడం లేదు. అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్స్ డల్లుగానే నడుస్తున్నాయి. కొన్ని షోలు మాత్రమే ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో కనిపిస్తున్నాయి. దీనికి కారణం సినిమాకు బజ్ కాస్త తగ్గడంతో పాటు టికెట్ల ధరల ప్రభావం కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. అధిక టికెట్ల ధరలు వరుసగా పెద్ద సినిమాలను దెబ్బ కొట్టడంతో మేజర్ లాంటి క్రేజీ మూవీకి వ్యూహాత్మకంగా వ్యవహరించింది చిత్ర బృందం.
సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 195గా రేట్లు ఫిక్స్ చేశారు. ఇది సినిమాకు బాగా కలిసొచ్చింది. ఆక్యుపెన్సీ పెరిగింది. విక్రమ్ మూవీకి ఇంకా తక్కువ రేట్లుండటంతో దానికీ ప్లస్ అయింది. ఇదే సమయంలో పక్కా కమర్షియల్ మూవీకి మరింత తక్కువ రేట్లు పెట్టనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇలా అందరూ రేట్లు తగ్గిస్తుంటే.. నాని సినిమాకు సింగిల్ స్క్రీన్లలో 175, మల్టీప్లెక్సుల్లో 250 పెట్టడం ప్రేక్షకులకు రుచించడం లేదు. నాని సినిమాలను ఎక్కువగా దిగువ, మధ్యతరగతి జనాలే చూస్తారు. వాళ్లకు అందుబాటులో ఉండేలా ఇంకా రేట్లు తగ్గించాల్సిందని, అలా లేదు కాబట్టే అడ్వాన్స్ బుకింగ్స్ మీద ప్రభావం పడుతోందని అంటున్నారు.
This post was last modified on June 8, 2022 12:31 pm
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…
ఇప్పటి వరకు పీపీపీ మోడల్ గురించే ప్రజలకు తెలుసు. అయితే.. తొలిసారి ఏపీలో పీపీపీపీ అనే 4-పీ ఫార్ములాను సీఎం…
యంగ్ హీరో నాగచైతన్య ప్రస్తుతం తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్టుల మీద దృష్టి సారిస్తున్నాడు. ప్రస్తుతం చందూ మొండేటి…
ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో చావు దెబ్బతిన్న వైసీపీ..ఇంకా పాఠాలు నేర్చుకున్న ట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా…