సినిమాలతో పోటీ పడుతూ వెబ్ సిరీస్ లను నిర్మిస్తున్నాయి డిజిటల్ సంస్థలు. క్యాస్టింగ్, క్వాలిటీ, టెక్నికల్ టీమ్ ఇలా ఏది తీసుకున్నా రాజీ అనే ప్రస్తావనే ఉండటం లేదు. ఏడాది చందా తీసుకున్న సబ్స్క్రైబర్స్ కు న్యాయం జరిగేలా కంటెంట్ కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న సుడల్ ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. సరే ఇలాంటివి బోలెడు వస్తాయి కదా ఇందులో ప్రత్యేకత ఏముందనే సందేహం కలుగుతోందా. అక్కడికే వద్దాం.
2017లో మాధవన్ విజయ్ సేతుపతి కాంబోలో వచ్చిన విక్రమ్ వేదా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తమిళం మీద అవగాహన ఉన్న వాళ్లకు బాగా తెలుసు. దీనికి దర్శకత్వం వహించింది భార్య భర్తలు పుష్కర్ గాయత్రి. వీళ్ళే ఇప్పుడు హిందీలో హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ తో దాన్ని రీమేక్ చేస్తున్నారు. ఈ ఆరేళ్ళ వీళ్ళు ఇంకే కొత్త సినిమా చేయలేదు. ఒక సిరీస్ కు స్క్రిప్ట్ రాసుకున్నారు. అదే ఈ సుడల్. కాకపోతే దర్శకత్వం బ్రహ్మ-అనుచరణ్ లకు అప్పగించారు.ట్రైలర్ కూడా వచ్చేసింది. జూన్ 17 దీని మొదటి సీజన్ స్ట్రీమింగ్ కాబోతోంది.
తప్పిపోయిన తన చెల్లి కోసం వెతుకుతున్న అక్కకు ఓ గ్రామంలో ఉండే ఆచారాలు, అక్కడి ఫ్యాక్టరీ స్థితిగతులు బోలెడు అనుమానాలు రేకెత్తిస్తాయి. వాటిని దాటుకుని ఆమె జాడను ఎలా కనుక్కుందనేదే ఈ సుడల్ కథ. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 60 భాషల్లో దీన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. విజువల్స్ చూస్తుంటే బడ్జెట్ పరంగా చాలా రిస్క్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్, పార్తిబన్, కతిర్ లు ప్రధాన తారాగణం. అప్పుడెప్పుడో విశాల్ పొగరులో లేడీ విలన్ గా అదరగొట్టిన అతని వదిన శ్రేయ రెడ్డి ఓ కీలక పాత్ర చేశారు. ఇంత గ్రాండ్ స్కేల్ మీద వస్తున్న ఈ సుడల్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో..
This post was last modified on June 7, 2022 11:03 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…