కమల్ హాసన్ అభిమానులు ఇప్పుడు మామూలు ఆనందంలో లేరు. అందుక్కారణం.. విక్రమ్. బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ప్రకంపనలు రేపుతోంది. నాలుగు దశాబ్దాలకు పైగా అద్భుతమైన పాత్రలు, గొప్ప గొప్ప సినిమాలతో భారతీయ సినీ చరిత్రలోనే ఎవ్వరూ అందుకోలేని స్థాయిని అందుకున్న కమల్.. గత దశాబ్ద కాలంలో బాగా జోరు తగ్గించేశారు. చేసిన సినిమాలు తక్కువ. వాటిలో ఆకట్టుకున్నవి మరీ తక్కువ. ఐదారేళ్లుగా ఆయన సినిమాల పరంగా లైమ్ లైట్‌కు బాగా దూరం అయ్యారు.
ఎప్పుడో పూర్తి చేసిన ‘విశ్వరూపం’ రిలీజై నిరాశపరిచింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైన ‘ఇండియన్-2’ మధ్యలోనే ఆగిపోయింది. దీనికి తోడు ఆయన రాజకీయాలపై దృష్టిపెట్టారు. అందులో చేదు అనుభవం ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో కమల్ కెరీర్ దాదాపు క్లోజ్ అయినట్లుగా కనిపించింది. కానీ ‘విక్రమ్’ సినిమాతో కమల్ ఇప్పుడు బ్యాంగ్ బ్యాంగ్ రీఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం వివిధ భాషల్లో అదరగొడుతోంది. రిలీజైన ఐదో రోజుకే 200 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువైంది.
ఈ నేపథ్యంలో కమల్‌కు ఇలాంటి విజయాన్నిచ్చిన యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. స్వయంగా కమలే అతణ్ని ప్రశంసల్లో ముంచెత్తుతున్నాడు. ముందు నుంచి లోకేష్ ప్రతిభను కొనియాడుతున్న కమల్.. తాజాగా అతడికి ఒక లేఖ రాశాడు. తమిళంలో రాసిన ఆ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకేష్ తన అభిమానిగా తనను కలిసి.. ఇలాంటి సినిమా తీయడంపై కమల్ ప్రస్తావించాడిందులో. మామూలుగా తన అభిమానులు మిగతా వాళ్లతో పోలిస్తే వైవిధ్యంగా ఉండాలని, వాళ్ల ఆలోచన స్థాయి ఎక్కువగా ఉండాలని తాను కోరుకుంటానని.. ఐతే విమర్శకులు ఈ విషయంలో అంత స్వార్థం ఉండకూడదని అంటుంటారని.. కానీ లోకేష్ అనే తన అభిమాని ఇప్పుడు ‘విక్రమ్’ లాంటి సినిమా తీసి తనను గర్వించేలా చేశాడని.. అందుకు అతణ్ని అభినందించడానికి తగ్గ మాటలు కూడా రావట్లేదని కమల్ వ్యాఖ్యానించడం విశేషం. లోకేష్ ఈ విజయాన్ని తలకెక్కించుకోకుండా నేలమీదే ఉండి కష్టపడితే అతడికి మరిన్ని విజయాలు దక్కుతాయని కమల్ అన్నాడు. ఈ లెటర్ విషయంలో లోకేష్ చాలా ఎగ్జైట్ అయ్యాడు. తన ‘ఖైదీ’ సినిమాలో ఫేమస్ డైలాగ్ అయిన ‘లైఫ్ టైం సెటిల్మెంట్’ డైలాగ్‌ను దీనికి అన్వయిస్తూ ఇది లైఫ్ టైం సెటిల్మెంట్ అప్రిసియేషన్‌గా అతను అభివర్ణించాడు.
This post was last modified on June 7, 2022 10:53 pm
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…