ఈ వీకెండ్ మేజర్, విక్రమ్ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నాయి. దాంతో రెండు సినిమాలు వాటి రేంజ్ ని బట్టి కలెక్షన్స్ రాబడుతున్నాయి. ఈ రెండు వేర్వేరు జానర్ సినిమాలు. ఒకటి నిజజీవిత కథతో తెరకెక్కిన ఎమోషనల్ సినిమా కాగా మరొకటి పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్. అయితే మేజర్ సినిమాకి వచ్చే సరికి వీరమరణం పొందిన సైనికుడి కథ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎమోషనల్ అవుతూ కనెక్ట్ అవుతున్నారు. ఇక యాక్షన్ ఇష్టపడే మాస్ ఆడియన్స్ మాత్రం వీకెండ్లో విక్రమ్ కి ఓటేసి పదే పదే చూశారు.
మేజర్ మూడు రోజులు గానూ 35 కోట్ల (గ్రాస్) కలెక్ట్ చేసింది. ఇక కమల్ ‘విక్రమ్’ వరల్డ్ వైడ్ గా 150 కోట్ల (గ్రాస్) రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ దాదాపు 7కోట్ల షేర్ అందుకుంది. ఈ మధ్య కాలంలో ఓ డబ్బింగ్ సినిమా ఈ రేంజ్ లో కలెక్ట్ చేయడమంటే అది విక్రమ్ కే దక్కింది. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో మేజర్ పై విక్రమ్ ఎఫెక్ట్ బాగా పడింది. లేదంటే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఇంకా ఎక్కువే కలెక్ట్ చేసేది. సోలో రిలీజ్ అయ్యుంటే మంచి వసూళ్ళు దక్కేవి. కానీ పోటీగా ఓ మాస్ సినిమా వచ్చే సరికి విక్రమ్ తో పాటు మేజర్ కలెక్షన్లు షేర్ చేసుకోవాల్సి వచ్చింది.
ఏదేమైనా రెండు సినిమాలు ఈ వీకెండ్ బాగానే వసూళ్ళు అందుకున్నాయి. సోమవారం మార్నింగ్ షోలకు కూడా చాలా ఏరియాల్లో డీసెంట్ కలెక్షన్స్ దక్కాయి. ఈ రెండు సినిమాల వల్ల ‘సామ్రాట్ పృథ్వీ రాజ్’ బాగా లాస్ అయ్యింది. అలాగే ఎఫ్ 3 కలెక్షన్ల మీద కూడా ఈ రెండు సినిమాల ప్రభావం పడింది. ఇక ‘అంటే సుందరానికీ’ వచ్చే వరకూ ఈ వీక్ ఈ రెండు సినిమాలు స్ట్రాంగ్ గా ఉంటే ఇంకా మంచి వసూళ్ళు అందుకోవడం ఖాయం. చూడాలి మేజర్, విక్రమ్ లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తాయో మరి.