ఇప్పుడు సౌత్ లోనే కాదు నార్త్ లోనూ పేరు మారుమ్రోగిపోయేలా దూసుకుపోతున్నాడు అనిరుద్ రవిచందర్. కెరీర్ మొదలుపెట్టి పదేళ్లు దాటినా ఇంత భీభత్సమైన ఫామ్ కొనసాగించడం రెహమాన్, ఇళయరాజా, దేవాల తర్వాత అనిరుద్ కే సాధ్యమయ్యిందన్న కోలీవుడ్ మీడియా మాటలను తప్పనలేం. డిజాస్టర్స్ లోనూ తన వర్క్ మీద కామెంట్స్ రానంత గొప్ప అవుట్ ఫుట్ ఇవ్వడానికి బీస్ట్ ని మించిన ఉదాహరణ అక్కర్లేదు. ఆ సినిమాలో హలమతి అబీబో, బిజిఎం ఈ రెండు దానికి ఎంత పెద్ద ప్లస్ అయ్యాయో ప్రత్యక్షంగా చూశాం.
ఇప్పుడీ కుర్రాడి సుడి మాములుగా లేదు. మన దగ్గర ఎన్టీఆర్ 31 కొట్టేశాడు. పవన్ కళ్యాణ్ తో చేసిన అజ్ఞాతవాసి తాలూకు చేదు జ్ఞాపకాలు పూర్తిగా చెరిగిపోయేలా బెస్ట్ ఆల్బమ్ తెలుగులో ఇస్తానని సన్నిహితుల వద్ద అంటున్నాడట. ఇప్పుడు షారుఖ్ ఖాన్ జవాన్ కు సైతం తనే కంపోజ్ చేయబోతున్నాడు. ప్యాన్ ఇండియా లెవెల్ క్రేజీ అవుట్ ఫుట్ రావాలంటే అనిరుద్ ని మించిన అల్టిమేట్ ఛాయస్ లేదనే ఉద్దేశంతో దర్శకుడు ఆట్లీ మొదటసారి తనతో చేతులు కలిపాడు. ఆల్రెడీ సిట్టింగ్స్ కూడా మొదలైపోయాయి.
లేటెస్ట్ గా రిలీజైన కమల్ హాసన్ విక్రమ్ లోనూ అనిరుద్ పనితనం మీద ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పుడు తన రాబోయే సినిమాల్లో రజనీకాంత్-నెల్సన్ మూవీ, ఇండియన్ 2, అజిత్-వినోత్ ప్రొజెక్ట్, విజయ్-లోకేష్ కాంబోలో రాబోయే రెండో సినిమా ఉన్నాయి. వీటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ 31, జవాన్ లు. ఇంకా ఆఫర్స్ వస్తున్నాయి కానీ అనిరుదే టైం లేక వదులుకుంటున్నవి చాలా ఉన్నాయట. పెద్దలు అదేదో శుక్రమహర్దశ అంటుంటారు. అంతకు మించి అనేలా సాగుతోంది ఈ బ్యాక్ గ్రౌండ్ స్పెషలిస్ట్ చూస్తున్న స్టార్ డం.
This post was last modified on June 4, 2022 12:32 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…