తమిళనాట మక్కల్ సెల్వన్ గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే విజయ్ సేతుపతి ఏ పాత్ర ఇచ్చినా సరే నచ్చితే పాజిటివా నెగటివా అని ఆలోచించడు. ఒప్పేసుకుని దాని కోసం తన ప్రాణం పెట్టేస్తాడు. కానీ గత కొంత కాలంగా తను ఎంచుకుంటున్న క్యారెక్టర్స్ ని చూస్తే తన స్థాయిని తనే తగ్గించుకుంటున్నారేమోననే అనుమానం కలగక మానదు. విజయ్ మాస్టర్ లో ఫుల్ లెన్త్ విలన్ రోల్ చేసినప్పుడు సరే ఏదో మార్పు కోసం అయ్యుంటుందని అభిమానులు సరిపుచ్చుకున్నారు. అందులో హీరోతో సమానంగా పేరు రావడంతో పాస్ అయ్యింది.
కట్ చేస్తే ఇప్పుడు కమల్ హాసన్ విక్రమ్ లోనూ అదే తరహా ఊర మాస్ లోకల్ విలన్ గా చూపించడం సెకండ్ హాఫ్ లో దాని ప్రాధాన్యం బాగా తగ్గించేసి క్లైమాక్స్ లో పాత కాలం డెన్ విలన్ గా చంపేయడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా తన శరీరం మీద విజయ్ సేతుపతి ఈ మధ్య శ్రద్ధ వహించడం లేదు. విక్రమ్ లోనూ చొక్కా లేకుండా భారీ కాయంతో కనిపించాడు. సరే సీన్ డిమాండ్ చేసిందని సర్దిచెప్పుకున్నా మరీ బి గ్రేడ్ ప్రతినాయకుడిగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఆయన్ను మారుస్తున్నారని ఫ్యాన్స్ కంప్లయింట్
96లాంటి కల్ట్ క్లాసిక్స్ తో ఎంతో పేరు తెచ్చుకుని తర్వాత దాన్ని నిలబెట్టుకోవడంలో విజయ్ సేతుపతి ఫెయిల్ అవుతున్నారు. తెలుగులో ఉప్పెన మంచి చేస్తే సైరా కేవలం చిరంజీవి కోసం ఒప్పుకున్నందుకు ఎలాంటి గుర్తింపు తేలేదు. మధ్యలో వచ్చిన లాభం. తుగ్లక్ దర్బార్, అన్నాబెల్లె సేతుపతి, కన్మణి రాంబో కతిజా ఇవేవి కనీస స్థాయిలో ఆడలేదు. కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో వర్సటాలిటీ ఉన్న యాక్టర్ గా గుర్తింపు ఉన్నా విజయ్ సేతుపతి ఇకనైనా పెర్ఫార్మన్స్ బేస్డ్ పాత్రలు చేయాలని మూవీ లవర్స్ కోరుతున్నారు. మరి ఆయన వింటారో లేక నాదారి నాదే అని ఇలాగే కొనసాగిస్తారో చూడాలి
This post was last modified on June 3, 2022 4:44 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…