బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కూతురు సయీ మంజ్రేకర్ తెలుగు సినిమాల మీద ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గని’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది సయీ. అయితే ఆ సినిమాకు బాలీవుడ్ బ్యూటీ కి చేదు అనుభవం మిగిల్చింది. సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. ఆ సినిమా చేస్తుండగానే అడివి శేష్ ‘మేజర్’ లో చాన్స్ కొట్టేసింది సయీ. ఇప్పుడు మేజర్ మీదే తన ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాతో తెలుగులో మరింత బిజీ అవ్వాలని చూస్తుంది.
నిజానికి మేజర్ లో సయీ కనిపించేది కాసేపే. ఆమెకు కథలో స్పేస్ చాలా తక్కువే. అయినా హీరోయిన్ పాత్ర కాబట్టి ఉన్న కాసేపు పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ నిజజీవిత కథతో తెరకెక్కిన ఈ సినిమా రేపే థియేటర్స్ లోకి వస్తుంది. ఇప్పటి వరకూ చాలా ప్రీమియర్స్ వేశారు. భారీ ఏమి రాలేదు కానీ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అనే స్టాంప్ మాత్రం దక్కించుకుంది.
ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజవుతోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. నార్త్ ఆడియన్స్ కి సినిమా ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.మేజర్ కి ఏ మాత్రం హిట్ టాక్ వచ్చిన ఈ అమ్మడుకి తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయం. మరి సయీ కి ఈ సినిమా ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.
This post was last modified on June 2, 2022 5:08 pm
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…