ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత గొప్ప నటుల్లో ఒకడు కమల్ హాసన్. హీరోగా కూడా ఆయన ఇమేజ్ తిరుగులేనిది. తమిళంలో ఒకప్పుడు రజినీకాంత్‌కు దీటుగా భారీ హిట్లు కొట్టి తిరుగులేని స్టార్‌గా అవతరించారు. తెలుగులో కూడా చాలా ఏళ్ల పాటు ఆయన హవా నడిచింది. డైరెక్ట్ తెలుగు చిత్రాలతో ఇక్కడి స్టార్లకు దీటుగా హిట్లు కొట్టారు. అలాంటి హీరో.. గత 10-15 ఏళ్లలో ఇక్కడ మార్కెట్‌ను పూర్తిగా కోల్పోయారు. సినిమాలు తగ్గించేయడం, చేసిన వాటిలో కూడా ఆయన స్థాయికి తగనివే ఎక్కువ ఉండటం అందుక్కారణం.
ఐతే కొన్నేళ్ల విరామం తర్వాత కమల్ విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద స్థాయిలోనే రిలీజవుతోంది. యువ కథానాయకుడు నితిన్ నిర్మాణ సంస్థ ద్వారా తెలుగులోకి వస్తోంది విక్రమ్.
కమల్‌కు తోడు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ లాంటి మేటి ఆర్టిస్టులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. లోకేష్ కనకరాజ్ లాంటి క్రేజీ డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. తెలుగులో మంచి రిలీజ్ దక్కింది. ప్రమోషన్లు కూడా కొంచెం గట్టిగానే చేశారు. కానీ ఆ ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపించడం లేదు. కమల్ ట్రాక్ రికార్డు బాగా దెబ్బ తినేయడం, తమిళ అనువాద చిత్రాల పట్ల మన వాళ్లకు ఆసక్తి తగ్గిపోవడం ఇందుకు కారణం కావచ్చు. అడివి శేష్ సినిమా మేజర్‌కు బంపర్ క్రేజ్‌తో రిలీజవుతుండడం, గత వారం వచ్చిన ఎఫ్-3 జోరు కొనసాగిస్తుండటం విక్రమ్‌కు ప్రతికూలంగా మారినట్లు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ఇక్కడ ప్రభావం చూపించాలంటే.. అదిరిపోయే టాక్ రావాలి. సినిమా పర్వాలేదు.. జస్ట్ ఓకే అంటే నడవదు. మారిన పరిస్థితుల్లో, ఇంత పోటీలో జనాలు థియేటర్లకు కదలరు. కాబట్టి కమల్ చాలా గట్టిగా కొట్టాల్సిందే. అప్పుడే మళ్లీ తెలుగులో ఆయన కోరుకున్న విజయం దక్కుతుంది.
This post was last modified on June 2, 2022 11:29 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…