‘సర్కారు వారి పాట’ కు సంబంధించి మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న “మురారి వా” సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ముందు “మురారి వా” అనే సాంగ్ షూట్ చేసి దాన్ని పక్కన పెట్టేసి ఉన్నపళంగా “మమ మహేశా” అనే స్పెషల్ మాస్ సాంగ్ షూట్ చేసి సినిమాలో జత చేశారు. మురారివా సాంగ్ కి సంబంధించి కొంత వర్క్ ఉందని చెప్పుకున్నారు.
రిలీజ్ తర్వాత యూ ట్యూబ్ లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో మహేష్ అభిమానులు ఆ సాంగ్ చూసేందుకు ఎంతగానో ఎదురుచూశారు. సోషల్ మీడియా వేదికగా ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ ఆ సాంగ్ రిలీజ్ ఎప్పుడని అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆ సాంగ్ ని రెడీ చేసి ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. కానీ మేకర్స్ ప్రకటించినట్లు ఈ పాట యూ ట్యూబ్ లో రిలీజ్ కావడం లేదు.
సినిమాలో జత చేసి థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన కూడా ఇచ్చారు. తాజాగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి సినిమాకు ఎటాచ్ చేశారు. ఇవాల్టి నుండే సాంగ్ సినిమాలో కనిపించనుంది. నిజానికి ‘ఎఫ్ 3’ రిలీజ్ తర్వాత సర్కారు చాలా చోట్ల డ్రాప్ అయింది.
అందుకే ఉన్నపళంగా సాంగ్ ఎటాచ్ చేసి మళ్ళీ కొంత కలెక్షన్ అందుకునే ప్లాన్ వేశారు. మరి ఈ సాంగ్ కోసం ప్రేక్షకులు మళ్ళీ ఈ సినిమా చూసే అవకాశం ఉండకపోవచ్చు, కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం “మురారి వా” కోసం మళ్ళీ జేబులో డబ్బులు తీసి టికెట్ కౌంటర్లో వేయడం ఖాయం. మరి హరీబరీగా రెడీ చేసిన ఈ సాంగ్ కి థియేటర్స్ లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ?
This post was last modified on June 2, 2022 11:05 am
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…