ఎఫ్3 తర్వాత ఎన్ని సినిమాలు వస్తున్నా ఫ్యామిలీ ఆడియన్స్ నెక్స్ట్ టార్గెట్ అంటే సుందరానికి మీదే ఉంది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఈ ఎంటర్టైనర్ జూన్ 10న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమోషన్ల వేగం పెంచనున్నారు. రేపు ట్రైలర్ లాంచ్ జరిగాక దసరా షూటింగ్ కు బ్రేక్ తీసుకుని నాని సమయమంతా దీనికే కేటాయించబోతున్నాడు.
బ్రోచేవారెవరుగా సక్సెస్ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే. అంచనాలు మెల్లగా ఎగబాకుతున్నాయి. అయితే ఫైనల్ కట్ కి డిసైడ్ చేసిన లెన్త్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 176 నిముషాల పాటు అంటే సుందరానికి ఎంటర్ టైన్ చేస్తాడట. అంటే మూడు గంటలకు జస్ట్ ఓ రెండు వందల నలభై సెకండ్లు తక్కువ అంతే.
ఇంత సుదీర్ఘమైన నిడివితో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆ మధ్య వదిలిన టీజర్ కూడా రెండు నిమిషాలకు పైగానే విడుదల చేసి సర్ప్రైజ్ చేశారు. ట్రైలర్ అంతకన్నా ఎక్కువే ఉంటుంది. ప్రమోషనల్ వీడియోకే అయిదు నిమిషాల కంటెంట్ ఇవ్వడం అరుదు.
ప్రేక్షకులకు అసలే ఓపిక తగ్గుతోంది. కట్టిపడేసే కథాకథనాలు ఉంటే తప్ప మూడు గంటల సేపు థియేటర్లో కూర్చోవడం కష్టంగా ఫీలవుతున్నారు. ఎఫ్3 ఎంత నవ్వించినా దాని లెన్త్ ని రెండున్నరలోపే పూర్తి చేయడం ప్లస్ అయ్యింది. రంగస్థలం, ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ తరహాలో అంటే సుందరానికి విజువల్ ఎఫెక్ట్స్ తో నిండిన సినిమా కాదు. ఓ ఇంటర్ క్యాస్ట్ జంట ప్రేమ ప్లస్ పెళ్లి కథ. మరి వివేక్ ఇంత కాన్ఫిడెంట్ గా డ్యూరేషన్ ని లాక్ చేశాడంటే తానిస్తున్న వినోదం మీద అంత నమ్మకమన్న మాట. చూద్దాం.
This post was last modified on June 1, 2022 4:12 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…