విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా కంప్లీట్ చేసి రిలీజ్ కి రెడీ చేసిన నాగ చైతన్య మళ్ళీ అదే దర్శకుడితో ‘ధూత’ అనే సిరీస్ చేస్తున్నాడు. OTT ఫ్లాట్ ఫాం కోసం చైతూ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చైతు. ఆ ప్రాజెక్ట్ తర్వాత చేయబోయే సినిమాలు కూడా లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది.
చైతూ నెక్స్ట్ లిస్టులో కిషోర్ తిరుమల , రాహుల్ సంక్రిత్యాన్ , విజయ్ కనక మేడల ఇలా కొందరు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరితో కాకుండా నెక్స్ట్ పరశురాం తో ‘నాగేశ్వరరావు’ అనే ఫ్యామిలీ ఎమోషన్స్ ప్లస్ ఫన్ ఎలిమెంట్స్ ఉండే సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు చైతు.
తాజాగా మహేష్ తో ‘సర్కారు వారి పాట’ తీసిన పరశురాం చైతూ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఎప్పుడో లాక్ అయింది కనుక త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టబోతున్నాడు. ‘నాగేశ్వరరావు’ సినిమా తర్వాత చైతు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దర్శకుడిగా గ్యాప్ తీసుకొని నటుడిగా మారిన తరుణ్ భాస్కర్ చైతూ కోసం ఓ బ్యూటిఫుల్ స్టోరీ రాసుకున్నాడట.
చైతూ నెక్స్ట్ లిస్టులో ‘నాంది’ దర్శకుడు విజయ్ కనక మేడల లేనట్టే అంటున్నారు. కిషోర్ తిరుమలతో కూడా ఇప్పట్లో సినిమా ఉండకపోవచ్చని టాక్ వినిపిస్తుంది. కమిట్ అయిన సినిమాల గ్యాప్ లో రాహుల్ సంక్రిత్యన్ కి మాత్రం చైతు చాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా అక్కినేని కుర్ర హీరో అరడజను సినిమాలతో భారీ లైనప్ పెట్టుకున్నాడు. అందులో తనకి పక్కాగా హిట్టిచ్చే దర్శకులతో ముందుగా సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు.
This post was last modified on May 30, 2022 11:45 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…