జూన్ 3న కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ రిలీజవుతుంది. నితిన్ తండ్రి నిర్మాత సుధాకర్ రెడ్డి సుమారు ఐదు కోట్లు పెట్టి తెలుగు థియేట్రికల్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా ఇటివలే కమల్ ని కలిసి తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తన టీంతో రావాలని కోరారు. కమల్ సరే అనడంతో హైదరాబాద్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
కమల్ , విజయ్ సేతుపతి , దర్శకుడు లోకేష్ తో పాటు అనిరుద్ కూడా హాజరు కానున్నారు. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా వస్తున్నారు. అయితే ఇదే వేడుకలో నితిన్ సినిమాకు సంబంధించి ప్రమోషన్ ప్లాన్ చేసుకున్నారు.
ఎడిటర్ టర్న్స్ డైరెక్టర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ‘మాచర్ల నియోజిక వర్గం’ అనే సినిమా చేస్తున్నాడు. త్వరలోనే రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేసే పనిలో ఉన్నాడు నితిన్. అందులో భాగంగా విక్రమ్ ఈవెంట్ లో నితిన్ సినిమా సాంగ్ లాంచ్ ప్లాన్ చేశారు. కమల్ హాసన్ చేత సాంగ్ రిలీజ్ చేయించబోతున్నారు.
ఇక అంత ఖర్చు పెట్టి తెలుగు రైట్స్ తీసుకొని తెలుగులో భారీగా ఈవెంట్ చేస్తున్న నిర్మాత కోసం కమల్ ఈ మాత్రం కూడా చేయకపోతే ఎలా అందుకే కమల్ నిర్మాత సుధాకర్ రెడ్డి కోరికను ఒప్పుకొని విక్రమ్ ప్రీ రిలీజ్ వేదికపై నితిన్ సినిమాను ప్రమోట్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పబోతున్నాడు. మరి కమల్ హాసన్ ప్రమోషన్ నితిన్ సినిమాకు ఎంత వరకూ హెల్ప్ అవుతుందో ?
This post was last modified on May 30, 2022 9:41 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…