తమిళం, హిందీలో కూడా వాళ్లిద్దరే

తెలుగు హీరోల సినిమాలు వేరే భాషల్లో నామమాత్రంగా డబ్ అయ్యేవి ఒకప్పుడు. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితులు మారాయి. మన వాళ్ల సినిమాలు ఒకేసారి బహు భాషల్లో తెరకెక్కుతున్నాయి. వేరే భాషల్లోనూ మన వాళ్లు డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా కోసం తమిళంలో డబ్బింగ్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ కూడా ‘బాహుబలి: ది కంక్లూజన్’కు వాయిస్ ఇచ్చాడు.

ఇప్పుడు రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ కోసమని జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పెద్ద సాహసమే చేస్తున్నారు. తెలుగు కాకుండా రెండు భాషల్లో వీళ్లిద్దరూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుండటం విశేషం. తమిళంతో పాటు హిందీలోనూ వీళ్లిద్దరి గొంతే వినిపించనుంది.

తెలుగు హీరోలు చాలామందికి తమిళం వచ్చన్న సంగతి తెలిసిందే. వాళ్ల కుటుంబాలు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చినవే. దీంతో చిన్నతనంలో తమిళంతో టచ్ ఉంది. ఐతే తారక్, చరణ్ ఊహ తెలిసే సమయం నుంచి హైదరాబాద్‌లోనే ఉన్నారు. వాళ్లకు తమిళంపై ఏమాత్రం పట్టు ఉందన్నది సందేహమే.

 చరణ్‌కు ఇంతకుముందు హీందీ మూవీ ‘జంజీర్’లో నటించిన అనుభవం ఉంది. మరి ఆ అనుభవం ఇప్పుడు కలిసొస్తుందేమో చూడాలి. జక్కన్న అంటేనే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కాబట్టి ప్రతి భాషలోనూ డబ్బింగ్ పక్కాగా ఉండేలా చూసుకుంటాడనడంలో సందేహం లేదు.

ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోవడంతో వర్క్ ఫ్రమ్ హోం చేస్తోంది ‘ఆర్ఆర్ఆర్’ టీం. తాజాగా రాజమౌళి, కీరవాణి, తమిళ రచయిత మదన్ కార్కీలతో కలిసి ఎన్టీఆర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడుతూ డబ్బింగ్ పని లాగిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కార్కీ ట్విట్టర్లో షేర్ చేశాడు.

This post was last modified on March 30, 2020 10:21 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కాంగ్రెస్ పార్టీ మీ అయ్య జాగీరా?:తీన్మార్ మ‌ల్ల‌న్న‌

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయ‌కుడు తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు ఆ పార్టీ రాష్ట్ర క‌మిటీ నోటీసులు జారీ చేసింది.…

43 minutes ago

మళ్లీ అవే డైలాగులు..తీరు మారని జగన్!

అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…

51 minutes ago

రిస్కులకు సిద్ధపడుతున్న గోపీచంద్

మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…

54 minutes ago

ఫిఫా పోస్టులో ‘NTR’.. స్పందించిన తారక్

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…

2 hours ago

చాట్ జీపీటీ-డీప్ సీక్‌ల‌కు దూరం: కేంద్రం ఆదేశాలు!

ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ ప్ర‌పంచం పుంజుకుంటోంది. ప్ర‌ధానంగా ఐటీ సంస్థ‌ల నుంచి ప్ర‌భుత్వ కార్యాల‌యాల వ‌ర‌కు కూడా ఏఐ ఆధారిత…

2 hours ago

వద్దనుకున్న దర్శకుడితో నాని సినిమా ?

ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…

3 hours ago