ప్రస్తుతం వరుస సక్సెస్ లు అందుకుంటున్న కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నెక్స్ట్ ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటివలే షూటింగ్ మొదలైన ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ బజ్ నెలకొంటుంది. శివ కార్తికేయన్ నటించిన ‘వరుణ్ డాక్టర్’, ‘డాన్’ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి.
ఈ రెండు సినిమాలు కామెడీ బేస్డ్ గా వచ్చిన డ్రామా సినిమాలే. డాన్ లో కూడా కామెడీ బాగా క్లిక్ అయ్యింది. అందుకే ఆ సినిమాకు తొలి వారంలో హైదరాబాద్ లో ఫుల్స్ పడ్డాయి. ఇక అనుదీప్ తో శివ కార్తికేయన్ చేస్తున్న సినిమా కూడా మంచి కామెడీ ఎంటర్టైనరే. తన కామెడీ రైటింగ్ తో శివ కార్తికేయన్ కేరెక్టర్ ని ఫన్నీ గా డిజైన్ చేసుకున్నాడు అనుదీప్.
ఇటివలే ‘డాన్’ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శివ కార్తికేయన్ అనుదీప్ గురించి చాలా చెప్పాలని తను చాలా టిపికల్ డైరెక్టరని నవ్వుతూ చెప్పుకున్నాడు. ఆ సినిమా రిలీజ్ టైంలో మీ అనుదీప్ గురించి చెప్తా అన్నాడు. డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న శివ కార్తికేయన్ కి పర్ఫెక్ట్ టైంలో అనుదీప్ తో బైలింగ్వెల్ సినిమా సెట్ అయింది.
తెలుగు ప్రేక్షకులకు ఈ స్ట్రైట్ సినిమాతో మరింత దగ్గర అవ్వాలని భావిస్తున్నాడు. అనుదీప్ చెప్పిన లైన్, కామెడీ సీన్స్ నచ్చడంతో శివ కార్తికేయన్ ఈ సినిమా ఒప్పుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న ఈ కోలీవుడ్ కుర్ర హీరో ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడితే ఇకపై తమిళ్ తో పాటు తెలుగులో బైలింగ్వెల్ ద్వారా మరిన్ని సినిమాలు చేసే అవకాశం ఉంది.
This post was last modified on May 30, 2022 8:44 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…