ఆమిర్ ఖాన్ ఒకప్పుడు అందరివాడిగా ఉండేవాడు. కానీ కొన్నేళ్ల ముందు ఇండియాలో ఇన్‌టాలరెన్స్ పెరిగిపోతోందని, తన భార్య-బిడ్డ ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తున్నారని ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించిన దగ్గర్నుంచి ఒక వర్గానికి అతను పెద్ద శత్రువుగా మారాడు. అలాగే ‘సత్యమేవ జయతే’ షోలో భాగంగా శివ లింగం మీద పోసే అరలీటరు పాలతో ఒక చిన్నారి కడుపు నిండుతుందంటూ అతను చేసిన కామెంట్ కూడా ఆ వర్గానికి తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
మరికొన్ని విషయాల్లో కూడా ఆమిర్ తీరు వారికి అభ్యంతరకరంగా మారి.. ఆమిర్ పట్ల వ్యతిరేకత పెంచుకున్నారు. ఈ ప్రభావం ఇప్పుడు ఆమిర్ కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ మీద గట్టిగానే పడేలా కనిపిస్తోంది. నిన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అయిందో లేదో.. ‘బాయ్ కాట్ లాల్ సింగ్ చద్దా’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఆమిర్ హిందూ వ్యతిరేకి అంటూ అతణ్ని తీవ్రంగా విమర్శిస్తూ తన సినిమాను హిందువులంతా బహిష్కరించాలని పిలుపు ఇస్తున్నారు.
20 రూపాయల పాలు శివలింగం మీద పోయడానికి బదులు ఒక చిన్నారి కడుపు నింపాలని ఆమిర్ అన్నాడని.. ఇప్పుడు ఆమిర్ సినిమా కోసం రూ.200 ఖర్చు పెట్టడం మాని ఆ డబ్బుల్ని పది మంది పిల్లల కడుపు నింపేందుకు ఉపయోగిద్దామని కౌంటర్లు వేస్తున్నారు హిందూ మద్దతుదారులు. అలాగే ‘పీకే’ సినిమాలో హిందూ దేవుళ్లను కించపరిచేలా సన్నివేశాలు పెట్టడాన్ని కూడా తప్పుబడుతూ.. ఇంకా వివిధ సందర్భాల్లో ఆమిర్ ప్రవర్తనను, వ్యాఖ్యలను ఎత్తి చూపుతూ.. ఈ సినిమా మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు.
‘లాల్ సింగ్ చద్దా’ను బహిష్కరించడానికి మరి కొన్ని కారణాలు కూడా చూపిస్తున్నారు. నెపోటిజం గురించి ప్రశ్నిస్తే మా సినిమాలు చూడొద్దు అని ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ దురుసుగా సమాధానం ఇవ్వడం.. ఆమె ముస్లిం అయిన సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకోవడం గురించి ప్రస్తావిస్తూ ‘లాల్ సింగ్ చద్దా’ను బాయ్ కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్ స్టార్ హీరోలందరి మీదా పగబట్టేసిన అతడి అభిమానులు సైతం ఈ నెగెటివ్ క్యాంపైనింగ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
This post was last modified on May 30, 2022 5:34 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…