ఇంతకీ చైతు ఫ్యాన్స్ హ్యాపీనా

నిన్న విడుదలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా ట్రైలర్ ఇప్పటికే 20 మిలియన్ల వ్యూస్ దాటేసి కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. కరోనా వల్ల పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కు అఫీషియల్ రీమేక్. హిందీ వెర్షన్ ని ప్రముఖ నటుడు, రచయిత అతుల్ కులకర్ణి రాయడం విశేషం. అమీర్ ని స్క్రీన్ మీద చూసె ఐదేళ్లు అవుతోంది. 2018లో థగ్స్ అఫ్ హిందుస్థాన్ రూపంలో భారీ డిజాస్టర్ అందుకున్నాక మళ్ళీ తెరమీద కనిపించకపోవడంతో ఫ్యాన్స్ కు భారీ అంచనాలున్నాయి.

ఇక విషయానికి వస్తే ఇందులో నాగ చైతన్య ఓ ప్రత్యేక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. చైతు ఫ్యాన్స్ నిన్న ట్రైలర్ నుంచి తన సీన్స్ ని గట్టిగా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ వాటిని ఒకటి రెండు షాట్స్ కే పరిమితం చేయడంతో నిరాశ చెందారు. లాల్ సింగ్ ఆర్మీ క్యాంప్ లో ఉన్నప్పుడు తన కొలీగ్ గా చైతు కనిపిస్తాడు. అది సినిమాలో కీలకమైన ఎపిసోడ్. ఒరిజినల్ లో చెప్పుకోదగ్గ స్పేస్ ఉన్న ఆ క్యారెక్టర్ ని ఇక్కడ కుదించారేమోనన్న అనుమానాలు లేకపోలేదు. సో రిలీజయ్యాక థియేటర్లలో చూస్తే కానీ క్లారిటీ రాదు.

ఏది ఏమైనా లెన్త్ తో సంబంధం లేకుండా అమీర్ ఖాన్ తో కలిసి తెరను పంచుకోవడం నాగ చైతన్యకు గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నాగార్జున సైతం తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ లో అవకాశం వచ్చినప్పుడల్లా అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, అనిల్ కపూర్ లాంటి స్టార్ల సినిమాల్లో క్యామియోలు చేశారు. కొన్ని హిట్టయ్యాయి.కొన్ని తేడా కొట్టాయి. ఇప్పుడు చైతు కూడా ఇమేజ్ లెక్కలు వేసుకోకుండా ఇలాంటి పాత్రలు చేయడం మంచిదే. ఆగస్ట్ 11న లాల్ సింగ్ చద్దా ప్రేక్షకుల ముందుకు రానుంది