‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయి సినిమా తీయలేకపోయి ఉండొచ్చు కానీ.. ‘ఆర్ఆర్ఆర్’తో బాక్సాఫీస్ దగ్గర దానికి దీటైన మ్యాజిక్ చేయగలిగాడు మన దర్శక ధీరుడు రాజమౌళి. ఇండియా వరకు ఈ చిత్రం బాహుబలితో సమానంగా వసూళ్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే అన్ని చోట్లా బాహుబలి రికార్డులను తుడిచిపెట్టేసింది కూడా. ఓవరాల్‌గా ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.1200 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
అన్ని చోట్లా ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసినట్లే కాబట్టి ఇవే ఫైనల్ కలెక్షన్లుగా భావించవచ్చు. ఐతే రాజమౌళికి ఉన్న మార్కెట్ పరిధిని బట్టి చూస్తే.. ఇంతటితో సినిమా పనైపోయినట్లు భావించడానికి వీల్లేదు. ‘బాహుబలి’తో ఆయన అన్ని సరిహద్దులనూ చెరిపేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమా అదరగొట్టింది. జపాన్ సహా పలు దేశాల్లో భారీ వసూళ్లు రాబట్టింది. యూరప్ కంట్రీస్‌లో, చైనాలో వేర్వేరుగా సినిమాను బాగా ప్రమోట్ చేసి, ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ కట్ ఒకటి రెడీ చేసి రిలీజ్ చేశారు. కాబట్టే ‘బాహుబలి-2’ కలెక్షన్లు రూ.1800 కోట్లకు చేరువగా వెళ్లాయి.
ఇక ఆమిర్ ఖాన్ ‘దంగల్’ సినిమా వసూళ్లు రూ.2 వేల కోట్లకు చేరాయంటే.. అందుకు చైనా ద్వారా వచ్చిన రూ.1200 కోట్లు ప్రధాన కారణం. ఐతే ‘బాహుబలి’ విషయంలో ముందు నుంచి ఒక ప్లానింగ్‌తో అడుగులు వేశాడు జక్కన్న. ‘ది బిగినింగ్’ ఇండియాలో సంచలనం రేపగానే.. అంతర్జాతీయ స్థాయిలో దీన్ని బాగా ప్రమోట్ చేసి, మార్కెట్ చేసి రిలీజ్ చేశారు. ‘ది కంక్లూజన్’ను ఇంకా పెద్ద రేంజికి తీసుకెళ్లారు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ విషయంలో ఇలాంటి ప్రయత్నాలే చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
చైనా, జపాన్ లాంటి దేశాల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే ఉద్దేశాలే కనిపించడం లేదు. ఇంటర్నేషనల్ కట్ గురించి చర్చే లేదు. ఇండియా సహా వివిధ దేశాల్లో రెగ్యులర్ మూవీస్‌ను రిలీజ్ చేసినట్లే చేశారు. ‘బాహుబలి’ బాగా ఆడిన చైనా, జపాన్ సహా పలు దేశాల్లో రిలీజ్ కోసం ప్రత్యేక ప్రణాళికలేమీ లేవు. వేరే వెర్షన్ అంటూ ఏమీ రెడీ చేయట్లేదు. ఈలోపు ఓటీటీల్లో సినిమా వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ వాళ్లు హిందీ వెర్షన్‌ను అంతర్జాతీయ స్థాయిలో బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో వేరే రిలీజ్ ఆలోచనే ఉన్నట్లు కనిపించడం లేదు. మరి జక్కన్న ఇలా ఈ చిత్రాన్ని ఎందుకు వదిలేశాడో?
This post was last modified on May 29, 2022 5:35 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…