Movie News

ప్రామిసింగ్ హీరోకు బాక్సాఫీస్ పరాభవం

ఐపీఎల్‌లో యాంకర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. బాలీవుడ్లో చిన్న సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ ద్వారా ప్రతిభ చాటుకుని.. ఆ తర్వాత ‘విక్కీ డోనర్’తో హీరోగా మారి తొలి సినిమాతో భారీ విజయాన్నందుకుని.. ఆపై మరిన్ని సూపర్ హిట్లతో స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు ఆయుష్మాన్ ఖురానా. పెద్ద స్టార్లలో ఆమిర్ ఖాన్ సినిమా అంటే చాలా బాగుంటుందని ఎలా అయితే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారో, చిన్న, మీడియం రేంజ్ హీరోల్లో అలాంటి ఇమేజ్ సంపాదించిన నటుడు ఆయుష్మాన్.

ఇలాంటి హీరో.. తనకు ‘ఆర్టికల్ 15’ లాంటి మరపురాని చిత్రాన్ని అందించిన అనుభవ్ సిన్హాతో మళ్లీ జట్టు కడుతూ చేసిన సినిమా ‘అనేక్’. ఇప్పటిదాకా క్లాస్ టచ్ ఉన్న నాన్-యాక్షన్ సినిమాలే చేసిన ఆయుష్మాన్.. ఈసారి రూటు మార్చాడు. అండర్ కవర్ పోలీస్‌గా పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేశాడు. ఈ సినిమా ప్రోమోల్లో ఆయుష్మాన్ చేసిన యాక్షన్ విన్యాసాలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. అతను టైగర్ ష్రాఫ్ స్టయిల్లో కనిపించాడు ఇందులో.

ఐతే ప్రేక్షకులకు ఆయుష్మాన్‌ను ఇలా చూడడం ఇష్టం లేనట్లుంది. శుక్రవారం రిలీజైన ‘అనేక్’ కనీస స్థాయిలోనూ ఆదరణ తెచ్చుకోలేకపోయింది. తొలి రోజు ప్రేక్షకులు లేక దేశవ్యాప్తంగా ఈ చిత్రానికి పెద్ద ఎత్తున షోలు క్యాన్సిల్ అయ్యాయట. ఒకప్పుడు డబుల్ డిజిట్ ఓపెనింగ్స్ రాబట్టిన ఆయుష్మాన్.. ఇప్పుడు తన కొత్త చిత్రంతో రాబట్టిన డే-1 నెట్ కలెక్షన్ రూ.1.5 కోట్లు మాత్రమే. ఇటీవలే వచ్చిన కంగనా రనౌత్ యాక్షన్ సినిమా ‘ధాకడ్’కు కూడా ఇలాంటి పరాభవమే ఎదురైంది బాక్సాఫీస్ దగ్గర. ఉత్తరాది ప్రేక్షకులు యాక్షన్‌ను ఇష్టపడుతున్నారు కానీ.. అది సౌత్ సినిమాల్లో చూపించే మసాలా యాక్షన్ టైపులో ఉండాలి.

క్లాస్‌గా కనిపిస్తూ యాక్షన్ విన్యాసాలు చేస్తే సరిపోదు. హీరోల పాత్రలు లార్జర్ దన్ లైఫ్ స్టయిల్లోఉండాలి. హీరో ఎలివేషన్ సరైన స్థాయిలో ఉండాలి. కొంచెం హంగామా తోడవ్వాలి. ఎమోషనల్ కనెక్ట్ ఉండాలి. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 సినిమాలు ఆ తరహాలోనే వారిని అమితంగా ఆకట్టుకున్నాయి. అవి చూసి బాలీవుడ్ స్టయిల్లో క్లాస్‌గా, సటిల్‌గా యాక్షన్ ఘట్టాలు తీస్తే వారికి ఆనట్లేదు. అందుకే ‘అనేక్’కు ఇలాంటి స్పందన ఎదురైనట్లుంది. ఈ సినిమాకు రివ్యూలు బాగానే ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం కనిపించడం లేదు.

This post was last modified on May 28, 2022 7:11 pm

Share

Recent Posts

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

5 minutes ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

31 minutes ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

59 minutes ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

2 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

2 hours ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago