ఏదైనా చిన్న సినిమాలో తమ అభిమాన హీరో సినిమా పోస్టర్ కనిపించినా, లేక ఏదైనా రిఫరెన్స్ ఉన్నా తెగ సంతోష పడిపోతుంటారు ఫ్యాన్స్. నాగ చైతన్య నటిస్తున్న ‘థాంక్యూ’ లో మహేష్ అభిమానుల కోసం అలాంటి ఓ సీక్వెన్స్ పెట్టాడు విక్రమ్. సినిమాలో మహేష్ కి అభిమానిగా కనిపించనున్నాడు చైతు. అందులో భాగంగా ‘పోకిరి’ సినిమా రిలీజ్ రోజు ఫ్యాన్స్ తో కలిసి చైతూ చేసే హంగామా తో ఓ సీన్ డిజైన్ చేశారు. షూటింగ్ టైంలోనే ఈ న్యూస్ మహేష్ ఫ్యాన్స్ కి రీచ్ అయింది. దాంతో చైతూ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
తాజాగా థాంక్యూ టీజర్ లో పోకిరి రిలీజ్ డే సీక్వెన్స్ కి సంబంధించి ఓ షాట్ ఉంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసి మహేష్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో సందడి చేస్తున్నారు. అంతే కాదు సినిమాలో మహేష్ పోకిరి హంగామా కోసం ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాం అంటూ పోస్టులు పెట్టుకుంటున్నారు. టీజర్ అన్ని మిలియన్స్ అందుకోవడానికి మహేష్ ఫ్యాన్స్ కూడా ఓ రీజనే.
సినిమాలో చైతూకి ఓ మూడు లవ్ స్టోరీస్ ఉన్నాయి. మూడు దశల్లో అభిరాం ప్రయాణాన్ని ప్రేమకథల్ని చూపిస్తూ సినిమా తెరకెక్కింది. అందులో భాగంగా యూత్ గా ఉన్నప్పుడు చైతూ అల్లరి చూపించబోతున్నారు. అందుకే మహేష్ కి ఫ్యాన్ గా పెట్టి ఆ సమయంలో జరిగే కథగా చూపించేందుకు పోకిరి సినిమాను ఎంచుకున్నారు. యూత్ లో మహేష్ కి మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ఈ సినిమాకు కలిసోచ్చేలా కనిపిస్తుంది. ఏదేమైనా ఫర్ ది ఫస్ట్ టైం మహేష్ అభిమానులు మరో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమాకు ఎన్ని టికెట్లు తెంచుతారో ఎంత కలెక్షన్స్ అందిస్తారో ? చూడాలి.
This post was last modified on May 26, 2022 6:46 pm
గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ - దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్…
చరిత్ర సృష్టిస్తూ బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన దురంధర్ ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డుకే ఎసరు…
తమిళ హీరోనే అయినప్పటికీ కార్తీకి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. నా పేరు శివతో మొదలుపెట్టి ఖైదీతో దాన్ని వీలైనంత…
తన ప్రియురాలి కోసం చైన్ స్నాచింగ్స్ దొంగగా మారిన ఒక ప్రియుడు... బైకుల మీద స్పీడుగా వెళుతూ మహిళల మెడల…
సంక్రాంతి పండక్కు తెలుగు రాష్ట్రాల థియేటర్లకు ఊహించిన సమస్యే తలెత్తింది. షోలు చాలక ప్రేక్షకుల డిమాండ్ అధికం కాగా దానికి…
వైసీపీలో నిన్న మొన్నటి వరకు పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కేంద్రంగా అనేక విమర్శలు వచ్చాయి.…