కొద్దిరోజుల క్రితం వచ్చిన ఊహాగానాలే నిజమయ్యాయి. రామారావు ఆన్ డ్యూటీ విడుదల వాయిదా పడింది. ముందు ప్రకటించిన జూన్ 17న రావడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ తో పాటు మరికొన్ని సాంకేతిక కారణాలు చెబుతున్నారు కానీ వాస్తవానికి ఇంకో సాంగ్ షూట్ పూర్తి చేయడంలో దర్శకుడు శరత్ మండవ, రవితేజ మధ్య ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, హీరో రెమ్యునరేషన్ ని ఆన్ టైం చెల్లించడంలో నిర్మాణ సంస్థ ఎక్కువ జాప్యం చేసిందని, అందుకే పోస్ట్ పోన్ తప్పదని ఆ మధ్య ప్రచారం జరిగింది.
ఇప్పుడది నిజమయ్యింది కానీ కారణాలు ఇవేనా కదా అనేది ఖచ్చితంగా చెప్పలేం. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టీజర్ మాస్ కి బాగానే ఎక్కింది.
క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఖిలాడీ రూపంలో దారుణమైన డిజాస్టర్ తిన్న రవితేజకు రామారావు ఆన్ డ్యూటీ హిట్ చాలా కీలకం. ముందు చేయాలనుకున్న ధమాకాను కొంత ఆలస్యం చేసి మరీ దీన్ని లైన్ లో పెట్టాడు. తీరా చూస్తే ఇప్పుడీ వాయిదాతో మళ్ళీ ఎప్పుడు వస్తుందో తర్వాత చెబుతామంటోంది టీమ్.
వదులుకున్నారు కానీ నిజానికి జూన్ 17 మంచి డేటే. అసలు పోటీనే లేదు. సత్యదేవ్ గాడ్సే ఒకటే షెడ్యూల్ అయ్యింది. దీనికి వారం ముందు నాని అంటే సుందరానికి, 777 ఛార్లీలు ప్లాన్ చేసుకున్నాయి.
అలాంటప్పుడు రామారావు వచ్చి ఉంటే బాగుండేది. ఒకవేళ జూలైలో ప్లాన్ చేసుకుంటే పక్కా కమర్షియల్, రంగరంగ వైభవంగా, ది వారియర్, కార్తికేయ 2, విక్రాంత్ రోనా, హిట్ 2లు వరసబెట్టి ఉన్నాయి. ఆగస్ట్ మూడో వారం మాత్రమే ఖాళీగా ఉంది. మరో మాస్ మహారాజా ఏం డిసైడ్ చేస్తాడో లెట్ వెయిట్ అండ్ సీ
This post was last modified on May 26, 2022 1:55 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…