తీసిన రెండు సినిమాల్లో ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు వెంకీ కుడుములకు చిరంజీవితో సినిమా ఓకే అయినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ ఎంటర్ టైనర్ మొదలవుతుందాని ఎదురు చూస్తున్నారు. ఛలో, భీష్మలో క్లీన్ కామెడీతో కడుపుబ్బా నవ్వించిన వెంకీ తమ మెగాస్టార్ ని రౌడీ అల్లుడు టైపులో ఓ రేంజ్ లో చూపిస్తారని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. కానీ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇది ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు లేవట. ఒకవేళ క్యాన్సిలైనా ఆశ్చర్యపోనక్కర్లేదని టాక్.
చిరు చెప్పిన ప్రకారం తాను రాసుకున్న స్టోరీకి రెండు వెర్షన్లు వినిపించిన వెంకీ కుడుముల ఫైనల్ గా ఆయన్ను కన్విన్స్ చేయలేకపోయారని వినికిడి. గతంలో ఇలాగే లూసిఫర్ రీమేక్ టైంలో సాహో ఫేమ్ సుజిత్ ఎంత ప్రయత్నించినా మెగా ఇమేజ్ ని మ్యాచ్ చేసేలా స్క్రిప్ట్ రాయలేక తప్పుకున్నాడు. ఆ తర్వాత అది ఎవరెవరి దగ్గరికో వెళ్లి చివరికి చెన్నై నుంచి మోహన్ రాజా పిలిపించి ఆయన చేతుల్లో పెట్టాల్సి వచ్చింది. యూత్ దర్శకులతోనే చిరుకి ఈ సమస్య ఎందుకు వస్తుందో అంతు చిక్కడం లేదు.
ఇది అధికారికంగా చెప్పలేదు కానీ లీకైన సోర్స్ ని బట్టి చూస్తే నిజమయ్యే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ అబద్దమైతేనే హ్యాపీ. ఈ నెల చివరి వారంలో విదేశాల నుంచి తిరిగి రాబోతున్న చిరంజీవి వెంటనే గాడ్ ఫాదర్ పూర్తి చేస్తారు. ఆపై వాల్తేర్ వీరయ్య, భోళా శంకర్ కు సంబంధించిన కాల్ షీట్స్ ప్లాన్ చేసుకుంటారు. వీటి తర్వాతే వెంకీ కుడుములది మొదలుకావాల్సి ఉంది. మరి డ్రాప్ అవుతారా లేక ఇదంతా గాసిప్పే అని ప్రూవ్ చేసేలా కొనసాగుతారా చూడాలి. ఈ ప్రాజెక్ట్ నిర్మాత డివివి దానయ్యన్న సంగతి తెలిసిందే.
This post was last modified on May 25, 2022 2:48 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…