కన్నడ చలన చిత్ర చరిత్రలో ఎవరూ అందుకోలేని విధంగా 1200 కోట్ల వసూళ్లతో టాప్ వన్ హిట్ సాధించిన కెజిఎఫ్ హీరో యష్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. పూరి జగన్నాధ్ తో ఉండొచ్చనే ప్రచారం జరిగింది కానీ అదంతా ఉత్తిదే. దర్శకులు నిర్మాతలు ఎందరు కలుస్తున్నా యష్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇంత పెద్ద ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చి పడేసరికి ఏం చేయాలో తెలియని ఒత్తిడిలో ఉన్నాడని అందుకే లేట్ చేస్తున్నాడని అభిమానులు భావిస్తున్నారు కానీ శాండల్ వుడ్ టాక్ ప్రకారం కథ వేరే ఉంది
యష్ కు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన మాతృబాష అంటే విపరీతమైన మక్కువ. అందుకే సినిమా ఏదైనా సరే అది కన్నడలోనే తీసి జాతీయ స్థాయిలో మార్కెట్ చేయాలనేది ఆలోచన. కానీ కెజిఎఫ్ కు ముందు యష్ వేరు. ఇప్పుడు తనకొచ్చిన స్టార్ డం వేరు. దీన్ని బ్యాలన్స్ చేసేంత సత్తా ఉన్న దర్శకులు అక్కడ లేరు. పైగా మార్కెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని రిస్క్ లేకుండా స్క్రిప్టులు రాసుకునే వాళ్లకు ఒక్కసారిగా ప్యాన్ ఇండియా సబ్జెక్టులు రెడీ చేయమంటే అంత సులభం కాదు. అందుకే ఈ ఆలస్యం.
యష్ తనదగ్గరికొచ్చిన టాలీవుడ్ బాలీవుడ్ దర్శకులకు స్పందించకపోవడం సరికాదు. కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా తెలివిగా తన రేంజ్ పెంచుకునే ఉద్దేశంతో లోకల్ ఫీలింగ్స్ ఏమీ పెట్టుకోకుండా ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లకు కమిటైపోయాడు. నెక్స్ట్ రామ్ చరణ్ లైన్ లో ఉన్నాడు. ఇవన్నీ కలిపితే వేల కోట్లతో ముడిపడిన ప్రాజెక్టులు. కానీ యష్ అలా ఆలోచించకుండా కన్నడవాళ్ళతోనే చేస్తాను ఇక్కడే ఉంటాను అంటే ఇబ్బందవుతుంది. కొంచెం ప్రాక్టికల్ గా అలోచించి త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటర్.
This post was last modified on May 25, 2022 11:51 am
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…