సూర్య తమ్ముడు అనే ట్యాగ్‌తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా.. తొలి సినిమా పరుత్తి వీరన్‌తోనే నటుడిగా తన సత్తా ఏంటో చూపించాడు కార్తి. చాలా తక్కువ సమయంలోనే అతను స్టార్ హీరోగా ఎదిగాడు. ఆవారా, నా పేరు శివ లాంటి చిత్రాలతో తెలుగులోనూ అతడికి మంచి గుర్తింపు, మార్కెట్ ఏర్పడింది. ఐతే కొన్నేళ్ల నుంచి అతడికి సరైన విజయాల్లేవు.
చివరగా కార్తి నుంచి వచ్చిన సుల్తాన్ డిజాస్టర్ అయింది. ఇప్పుడు మళ్లీ బౌన్స్ బ్యాక్ అవడానికి గట్టిగా ట్రై చేస్తున్నాడు. ఐతే కొన్నేళ్ల ట్రాక్ రికార్డు బాలేకున్నా అతడికి సినిమాల విషయంలో మాత్రం ఢోకా లేదు. వరుసగా క్రేజీ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. కొంచెం గ్యాప్ తర్వాత కార్తి బాక్సాఫీస్ దాడి కొంచెం గట్టిగానే చేయబోతున్నాడు.
మూడు నెలల వ్యవధిలో అతడి సినిమాలు మూడు ప్రేక్షకుల ముందుకు రాబోతుండటం విశేషం.
ముందుగా ఆగస్టులో అతడి కొత్త చిత్రం విరుమాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తనయురాలు అదితి ఈ చిత్రంతోనే కథానాయికగా పరిచయం అవుతోంది. ముత్తయ్య దర్శకుడు. ఇది రిలీజైన నెల రోజులకే మణిరత్నం మెగా మూవీ పొన్నియన్ సెల్వన్-1 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. భారీ తారాగణం ఉన్న ఈ చిత్రంలో కార్తి ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇంకో నెల రోజుల్లో కార్తి మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.
అదే.. సర్దార్. విశాల్‌తో అభిమన్యుడు, శివ కార్తికేయన్‌తో హీరో సినిమాలు తీసి సూపర్ హిట్లు కొట్టిన మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో కార్తి రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. అందులో ఒకటి నడి వయస్కుడి పాత్ర కావడం విశేషం. ఈ సినిమా కాంబినేషన్ కుదిరిన దగ్గర్నుంచి మంచి అంచనాలే ఉన్నాయి. సర్దార్ అక్టోబరులో దీపావళి కానుకగా రిలీజవుతుంది. కార్తి స్థాయి హీరో ఇలా మూడు నెలల్లో మూడు చిత్రాలతో రాబోతుండటం విశేషమే.
This post was last modified on May 25, 2022 9:32 am
సూళ్ళురుపేట లో ఈ నెల 18 నుండి 20 వరకు జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు శనివారం ఉదయం…
ఏపీలోని కూటమి సర్కారులో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీలో సీనియర్ నాయకుల వ్యవహారం కొన్నాళ్లుగా చర్చకు వస్తోంది. సీనియర్లు సహకరించడం…
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…